Cinetollywood

జై భీమ్:సినిమా రివ్యూ

నటులు:సూర్య,లిజో మోల్ జోస్,మణికంఠన్,ప్రకాశ్ రాజ్,రావు రమేశ్దర్శకుడు: టి.జె.జ్ఞాన‌వేల్‌సినిమా శైలి:Drama

మన దేశంలో న్యాయవ్యవస్థ గొప్పది. అందుకే పేదవాడైనా, ధనవంతుడైనా తనకు న్యాయం కావాల్సినప్పుడు కోర్టుల వైపు చూస్తారు. కోర్టు ముందు అంద‌ర‌రూ స‌మాన‌మే. అంద‌రికీ స‌మ న్యాయం ద‌క్కాల‌నేదే మ‌న రాజ్యాంగం మ‌న‌కు క‌ల్పించిన హ‌క్కు. దాన్ని కోర్టులు ప‌రిర‌క్షిస్తున్నాయి. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో జ‌రిగిన ఓ నిజ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాయే జై భీమ్‌. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్య‌, జ్యోతిక నిర్మించారు. థియేటర్స్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు. సినిమా విషయానికి వస్తే ఇదొక కోర్టు డ్రామా. సూర్య మొట్ట మొద‌టిసారి లాయ‌ర్‌గా క‌నిపించారు. ఈ కోర్టు డ్రామాలో అస‌లు సూర్య ఎలాంటి హీరోయిజాన్ని చూపించాడు? ఈ కోర్టు డ్రామా ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

కథ:

సినిమా 1995 బ్యాక్‌డ్రాప్ కాకినాడ‌లో మొద‌ల‌వుతుంది. అక్క‌డున్న జైలు నుంచి కొంద‌రు గిరిజ‌నులు బ‌య‌ట‌కు రాగానే వారిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించి త‌ప్పించుకోవ‌డానికి పోలీసులు వాళ్ల‌ని ప‌ట్టుకుపోతారు. అయితే అక్క‌డున్నఒకాయ‌న మాత్రం చెన్నై హైకోర్టులో ప‌నిచేసే లాయ‌ర్ చంద్రు(సూర్య‌) ద‌గ్గ‌ర‌కు వెళ్లి, అత‌ని సాయంతో త‌న కొడుకుపై అక్ర‌మ కేసు బ‌నాయించారంటూ కేసు వేస్తాడు. పోలీసులు అక్ర‌మ కేసు పెట్టారంటూ చంద్రు నిరూపించ‌డంతో పాటు రాష్ట్రంలో ప‌ది రోజుల్లో పోలీసులు 7000 కేసులు బ‌నాయించారంటూ వాదించ‌డంతో కోర్టు చంద్రు వాద‌న‌లో నిజం ఉంద‌ని గ్ర‌హించి అత‌నికి అనుకూలంగా తీర్పు చెబుతుంది. చంద్రు పేద‌లు, కార్మికుల ప‌క్షాన పోరాడుతుంటాడు. ఈ క్ర‌మంలో ఓ ప‌ల్లెటూరులోని అధికార పార్టీ నాయ‌కుడి ఇంట్లో బంగారం దొంగ‌త‌నం చేశాడంటూ పోలీసులు ఊరి బ‌య‌ట ఉండే గిరిజ‌నులు రాజ‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రినీ ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి తీసుకెళ‌తారు. ఈ గిరిజ‌నుల‌కు ఉండ‌టానికి ఇళ్లు, రేష‌న్ కార్డులు కూడా ఉండ‌వు. కాయ‌క‌ష్టం చేసుకుంటూ బ‌తుకుతుంటారు. పోలీసులు ఎందుకు దొంగ‌త‌నం చేశారంటూ ముగ్గురుని త‌మ స్టైల్లో విచారిస్తారు. మ‌రుసటిరోజునే ఆ ముగ్గురు జైలు నుంచి పారిపోతారు. ఎంత వెతికినా దొర‌క‌రు. మ‌ణికంఠ‌న్ భార్య సిన‌త‌ల్లి(లిజో జోస్‌)కి ఐదేళ్ల పాప ఉంటుంది. ఇంకా నిండు చూలాలు.. కానీ గిరిజనులు అనే ఒకే కారణంతో ఊరి పెద్ద‌లు సాయం చేయ‌రు. ఏం చేయాలో తెలియ‌న‌ప్పుడు ఆ గ్రామంలో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న మిత్ర‌(ర‌జిషా విజ‌య‌న్‌) సాయంతో లాయ‌ర్ చంద్రుని వ‌చ్చి క‌లుస్తుంది. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని తెలుసుకున్న చందు ఏం చేశాడు? సిన‌త‌ల్లికి న్యాయం జ‌రుగుతుందా? అస‌లు రాజ‌న్‌, అత‌ని స్నేహితులు ఎక్క‌డికి వెళ‌తారు? ఏమైపోతారు? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇది వ‌ర‌కు ప్ర‌స్తావించిన‌ట్లు ఇదొక కోర్టు డ్రామా.. ఇందులో సూర్య లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. సాధార‌ణంగా అటు మాస్‌,ఇటు క్లాస్‌లో మంచి ఇమేజ్ ఉన్న హీరో సూర్య లాయర్ పాత్ర అన‌గానే ఆ పాత్ర‌కు హీరోయిజం ఉంటుందా? మ‌న హీరో ఎలా ఫైట్స్‌, డాన్సులు చేస్తాడ‌నే భావ‌న కొంద‌రి అభిమానుల‌కు రావ‌చ్చు. అయితే కెరీర్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్న సూర్య‌, మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకున్నారు. అస‌లు లాయ‌ర్ ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తాడు అనే కోణంలో త‌న బాడీ లాంగ్వేజ్‌ను చూపించారు. పేద‌ల ప‌క్షాన పోరాడే లాయ‌ర్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. కోర్టు అన‌గానే పేజీల పేజీల డైలాగులు లేకుండా అస‌లు కోర్టు ప్రోసీడింగ్స్ ఎలా జ‌రుగుతాయో అలా సాగేలా ఉండే సినిమాలో లాయ‌ర్ పాత్ర‌. నిజానికి ఇది క‌డ‌లూరులోని జరిగిన లాక‌ప్ డెత్‌లో పోలీసుల‌కు వ్య‌తిరేకంగా కేసు వేసి బాధితుల‌కు న్యాయం చేసిన లాయ‌ర్ చంద్రు పాత్ర‌. ఆ లాయ‌ర్ వ్య‌క్తిత్వాన్ని సూర్య త‌న న‌ట‌న‌తో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.