సుబ్రహ్మణ్యపురం మూవీ రివ్యూ

subramaniapuram telugu movie review - subramaniapuram movie review

టైటిల్‌ : సుబ్రహ్మణ్యపురం
జానర్‌ : సస్పెన్స్‌ థ్రిల్లర్‌
నటీనటులు: సుమంత్‌, ఈషా రెబ్బా, సురేష్‌, భద్రం, జోష్‌ రవి తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాత: భీరం సుధాకర్‌ రెడ్డి
దర్శకత్వం: సంతోష్‌ జాగర్లమూడి

ఇంట్రో!!
సుమంత్ క‌ల‌ర్ ఫుల్ సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉండి.. మంచి క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయిన హీరో..
మళ్లీరావా లాంటి కూల్‌ హిట్‌తో పలకరించిన సుమంత్‌.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్‌ అయ్యాడు. తాజాగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సుబ్రహ్మణ్యపురంతో మ‌న ముందుకు వ‌చ్చాడు మ‌రి ట్రైల‌ర్ సినిమా చూడాలి అని అంద‌రిని ప్ర‌శ్నిస్తోంది చూద్దాం సినిమా ఎలాగ ఉందో.

కథ
సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడి గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి అభిషేకం జరగదు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అప్పటినుంచి వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అయితే ఇదంతా దైవమహిమ అనుకుంటూ ఊళ్లో వాళ్లు భయపడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి? అసలు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు నిర్వహించారు? వీటన్నింటిని కనిపెట్టడానికి సుమంత్‌ చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ. మిస్టరీ

విశ్లేషణ :
దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్‌ ఎప్పుడూ సక్సెస్‌ ఫార్మూలానే. ఇలాంటి స‌క్సెస్ స్టోరీలు మ‌న దేశంలో అన్ని సినిమా ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చాయి. ఇక సిరియ‌ల్స్ కు కూడా ఇటీవ‌ల ఈ దృక్ప‌దం పెరిగింది.. మ‌ళ్లీ సినిమాలు కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాయి. వాస్త‌వంగా చెప్పాలి అంటే దేవుడికి శ‌క్తుల‌కు లింక్ చేస్తూ చెప్పే క‌థ‌లు తీసే సినిమాలు స‌క్సెస్ అవుతాయి. ఇక్క‌డ ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది.కాని గ‌త చిత్రాల లింకుల‌తో ఈ సినిమా ఉందా అనే ప్ర‌శ్న ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. సుమంత్ న‌ట‌న బాగుంది, సినిమాటోగ్ర‌ఫీ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సినిమా అంతా విజువ‌ల్ రిచ్ లుక్ తో తీశారు అనే చెప్పాలి…. ప్రేక్ష‌కుల‌కు మ‌రో ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి స‌మాధానం కూడా చూపిస్తుంది ఈ స్టోరీ.

!!ప్లస్‌ పాయింట్స్‌!!
సుమంత్‌
కథ

!!మైనస్‌ పాయింట్స్‌!!
స్లో నెరేషన్‌

!!బాట‌మ్ లైన్ !! సుబ్రహ్మణ్యపురం స్టోరీ ఇది

రేటింగ్ 2.5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.