
ఒక యువతీ జీవితంలో జరిగిన సంఘటనలకు స్ట్రీట్ లైట్ తో ముడి పడిన కధ నే స్ట్రీట్ లైట్
స్ట్రీట్ లైట్ సినిమా పేరు లోనే వుంది హైదరాబాద్ మహా నగరం పగలు చాలా పవిత్రం గా కనిపిస్తూ రాత్రి అయ్యేసరికి పబ్ లు, పార్టీ లు,డ్రగ్స్, దందాలు చాలా అసాంగిక కార్యక్రమాలకు కేంద్ర బిందువు గా మారుతుంది అనే ఇంట్రడక్షన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ చివరన వుండే ఒక చిన్న ప్రాంతం లో బస్ స్టాప్ దగ్గర వుండే స్ట్రీట్ లైట్ చుట్టూ కధ తిరుగుతుంది, ఒక మాజీ ఎమ్ ల్ ఏ భార్య కుమారి తన కూతురువైజయంతి (తాన్యా దేశాయి )కార్ లో ప్రయాణిస్తూ ఆ స్ట్రీట్ లైట్ దగ్గరకి రాగానే హటాత్తు గా తన భర్త కుప్ప కూలి పోతాడు తన భార్య కారు దిగి హెల్ప్ హెల్ప్ అని రోదిస్తున్న సమయం లో ఏసీపీ ఉదయ్ కుమార్ (సీనియర్ నటుడు వినోద్ కుమార్ )కారు అపి చూస్తాడు, తన భర్త ని కాపాడవలసింది పోయి ఆమె మీద మోజు తో తన భర్త ని ఇంజక్షన్ ఇచ్చి చంపేసి తనకి ఇంజక్షన్ ఇచ్చి తనతో కోరిక తీర్చుకొని వెళ్ళిపోతాదడు , ఇది చూసిన చిన్న పిల్ల వైజయంతి ఉదయ్ కుమార్ మీద పగ పెంచుకుంటుంది, భర్త చని పోయిన తరువాత కుమారి వ్యసనాలకు అలవాటుపడి కూతురిని పట్టించుకోకుండా మగ వాళ్ళకి అలవాటు పడుతుంది, తల్లి చేసే చెడు పనులు భరిస్తూ పెరిగి పెద్దది అయిన వైజయంతి లాయర్ అవుతుంది ఈ స్ట్రీట్ లైట్ ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.
స్టోరీ :అనగనగ ఒక కుమారి ఆ కుమారి కూతురు వైజయంతి (తాన్యదేశాయి )తన భర్త కార్ నడుపుతూ సడన్ గా కుప్పకూలిపోవటం వలన తన భర్త ని కాపుడుకోవటానికి హెల్ప్ కోసం రోదిస్తూవుంటే అటుగా వచ్చిన ఏసీపీ ఉదయ్ కుమార్ (సీనియర్ నటుడు వినోద్ కుమార్ )హెల్ప్ చేయాలిసింది పోయి తనని లోబర్చుకుంటాడు భర్త చనిపోయాక చెడు వ్యసనాలకు అలవాటు పడి కూతురి ని కూడా పట్టించుకోకుండా తిరిగే కుమారి ఏసీపీ ఉదయ్ కుమార్ ట్రాన్సఫర్ అయ్యాక మగాళ్లను చాలా మందినిమారుస్తూ విచ్చల విడిగా విలాసాలకు అలవాటు పడుతుంది, మల్లి కొద్ది కాలం తరువాత ఏసీపీ ఉదయ్ మల్లి అదే ప్రదేశానికి ట్రాన్సఫర్ అవుతాడు, కుమారి తన కూతురి వల్ల ప్రాణ హాని వుంది అని ఉదయ్ కుమార్ ని సాయం అడుగుతుంది అప్పుడు ఉదయ్ కుమార్ మైండ్ కూతురి మీదకి పోతుంది అప్పుడు కుమారి ఇది తప్పు అని చెపుతుంది, తరువాత కుమారి చనిపోతుంది, అదే స్ట్రీట్ లైట్ కింద శ్రీను (చిత్రం శ్రీను )అని ఒక బ్రోకర్ ఉంటాడు తన దగ్గర దొరకనిది అంటూ ఏమి ఉండదు, అదే స్ట్రీట్ లైట్ కింద శకలక శంకర్ సినిమా షూటింగ్ జరుగుతుంది, అలాగే ఎప్పుడు నైట్ అవ్వగానే ఒక టిఫిన్ బండి ఆమె ఉంటుంది, అసలు శ్రీను ఎవ్వరు, టిఫిన్ బండి ఆమె కు స్టోరీ కి సమందం ఏమిటీ, కుమారి ని ఎవరు చంపారు, వైజయంతి రివెంజ్ ఎవరి కోసం తెలియాలి అంటె సినిమా చూడవలిసిందే
నటీనటుల పెర్ఫార్మన్స్ :
వినోద్ కుమార్ నెగటివ్ షేడ్స్ వుండే పాత్రలో చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకులు ను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి, ఇకపోతే వైజయంతి పాత్రలో హీరోయిన్ తన గ్లమరోస్ యాక్టింగ్ కి స్కోప్ వున్న పాత్రలో ఒదిగి పోయింది, వైజయంతి తల్లిగా నటించిన కుమారి పాత్ర ఈ చిత్రానికి చాలా కీలకం కద అంత ఈ పాత్రతోనే ముడిపడి ఉంటుంది చాలా బాగా నటించింది, చిత్రం శ్రీను వీళ్ళ అందరి తరువాత ఈ మూవీ లో ఇతనిదే అని చెప్పాలి అక్కడ జరిగే అన్నిటికి సాక్ష్యం అతనే అని చెప్పాలి
సాంకేతిక నిపుణుల పని తీరు :
డైరెక్టర్ విశ్వ లేక పోతే ఈ సినిమా లేదు తెర వెనుక సినిమా ని తన భుజాలు మీద మోసినాడు అని చెప్పాలి,తరువాత మ్యూజిక్ డైరెక్టర్ విరించి ఈ కథకి ప్రాణం పోసాడు అని చెప్పాలి,సినిమాటోగ్రఫేర్ రవిప్రకాష్ స్క్రీన్ రిచ్ నెస్ చాలా బావుంది,ఇకపోతే చివరిగా ప్రొడ్యూసర్ మామిడాల శ్రీనివాస్ మనం అనుకున్నదది తెర మీద కార్యరూపం దాల్చాలి అంటె ప్రొడ్యూసర్ ఉండాలి ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా ఇలాంటి గొప్ప సినిమా రావటానికి కారణమయ్యారు.
విడుదల :నవంబర్ 19
నటి నటులు :తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు
దర్శకత్వం : విశ్వ
నిర్మాత: మామిడాల శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : రవి సి కుమార్,
మ్యూజిక్ : విరించి,
ఎడిటర్ : శివ వై ప్రసాద్,
ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,
ఫైట్స్ : నిఖిల్,
కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్,
స్టూడియో : యుఅండ్ఐ.
పిఆర్ ఓ : మధు వి.ఆర్
రేటింగ్: 3/5