
ఆమె పుట్టినరోజుకి ‘ఆచార్య’ యూనిట్ గిఫ్ట్?కాజల్‌ని పక్కనపెట్టి పూజాకే ప్రాధాన్యత
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి త్వరలో మరో అప్డేట్ వస్తుందనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై అభిమానులు చూసి చాలాకాలమే అయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా రూపొందిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఆయన చివరి సారిగా ప్రేక్షకులకు వెండితెరపై కనిపించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. కానీ, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో ఆయన సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడం జరిగింది. ఇక చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో ‘ఆచార్య’ సినిమా ఒకటి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల అవుతున్నట్లు కొద్ది రోజుల క్రితమే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి శ్రీమతి సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా రెండుసార్లు షూటింగ్ వాయిదాపడింది. మొత్తానికి అన్ని అవరోధాలను దాటుకొని ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలో రామ్చరణ్ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన..
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి త్వరలో మరో అప్డేట్ రానుందనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
బుధవారం పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కొన్ని నెలల క్రితం ఉగాది పండుగ సందర్భంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేలు కలిసి ఓ రొమాంటిక్ యాంగిల్లో ఉన్న ఓ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మరో అప్డేట్ వస్తుందని వార్త వైరల్ అవుతోంది. కానీ, ఇప్పటివరకూ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ‘కాజల్‌ని పక్కన పెట్టి పూజకే ఆచార్య చిత్ర యూనిట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా ఏంటీ’ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.
Gallery
Latest Updates
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే