Cinetollywood

నేడు ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్..హీరోయిన్ ఇంట్లో గంజాయి:Drug Case

Drug Case : హీరోయిన్ ఇంట్లో గంజాయి దొరికింది. నటి, మోడల్ సోనియా అగర్వాల్ ఇంట్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించగా 40 గ్రాముల గంజాయి దొరికింది.

నటి, మోడల్ సోనియా అగర్వాల్ ఇంట్లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు నటి సోనియా అగర్వాల్ ఇంట్లో 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోదాలు నిర్హహించే సమయంలో హీరోయిన్ ఇంట్లో లేదు. మాదకద్రవ్యాల విక్రయదారులలో ఒకరు ఆమె గురించి వివరాలను అందించడంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కర్ణాటక పోలీసులు చాలా మంది ప్రముఖులను తమ స్కానర్ కింద ఉంచారు. ఈ కేసులో డీజే వచన్ చినప్పను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇటీవల, మాదకద్రవ్యాల విక్రయానికి సంబంధించి నైజీరియా దేశస్థుడు థామస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ .15.50 లక్షల విలువైన ఎక్టసీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా థామస్‌ తన రెగ్యులర్ కస్టమర్స్ అయిన కాలేజీ విద్యార్థులు, టెక్కీలు, సెలెబ్రిటీల జాబితాను పోలీసులకు అందచేశారని సమాచారం. థామస్.. ప్రతి డ్రగ్ పిల్ రూ .3000 కి అమ్మేవారట. కొకైన్‌ను గ్రాముకు 15,000 కి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.

ఇక గతంలో ఇదే డ్రగ్ కేసులో పోలీసులు.. శాండిల్‌వుడ్ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిని అరెస్టు చేసిన సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులోని నటులు, ప్రముఖులలో మాదకద్రవ్యాల వినియోగం ప్రబలంగా ఉందని పేర్కొంటూ పోలీసులు ఒక నివేదికను సమర్పించారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.