సిట్టింగ్ ఎమ్మెల్యేకా – మాజీకా జగన్ స్టెప్ ఏమిటి?

ravela-kishore

కొత్తనాయకులు వస్తే పాతనాయకులని వదిలెయ్యడం వేరే పార్టీల్లో జరుగుతుంది కాని వైసీపీలో జరుగదు, అందుకే జగన్ కు మరింత ప్రజాదరణతో పాటు నాయకుల ఆదరణ ఉంది.. అయితే తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలు అలాంటివే, నిజంగా టీడీపీ అభివృద్ది చేస్తుంది అని నమ్మతే- ఎమ్మెల్యే రావెల జనసేనలోకి, ఎమ్మెల్యే మేడా వైసీపీలోకి రాజీనామాలు చేసి ఎందుకు వెళతారు, సో రాజకీయంగా ఇలాంటి విమర్శలు కామన్. అయితే ఇప్పుడు ఓ సెగ్మెంట్లో ఇదే విషయంపై వైసీపీ గురించి తెలుగుదేశం చర్చించుకుంటోంది..

అదే పాణ్యం నియోజకవర్గం, బీజేపిక గుడ్ బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాటసాని వైసీపీలో చేరినప్పుడు ఆయనకు టిక్కెట్ హామీ వైసీపీ అధినేత జగన్ నుంచి ఏమీ లభించలేదు. కాని ఆయన చేరిన వారం రోజులకే వైసీపీలో తనకే టికెట్ అనేలా తన అనుచరులకు చెప్పారు.. ఇక ఆయనకు నంద్యాల పార్లమెంట్ సీటు ఇవ్వాలి అని జగన్ ఆలోచించారు, ఇప్పుడు ఆయన మాత్రం నంద్యాల ఎంపీ సీటు కాదు, పాణ్యం అసెంబ్లీసీటు కోసం పట్టుబడుతున్నారు, కాని ఈ విషయం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితకు రుచించడం లేదు.

జగన్ హామీ ఇవ్వకపోయినా తనకు కాకుండా కాటసానికి టికెట్ ఇచ్చారా, లేకపోతే ఎందుకు ఇలాంటి ప్రచారం చేసుకుటారు అని ఆమె కుటుంబం జగన్ పై సీరియస్ గా ఉన్నారు, అయితే సీనియర్లు చెబుతున్నా పాణ్యం విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వాలి అని ఇద్దరూ కోరుతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా గౌరు చరితకు ఇక్కడ ఫేమ్ఉంది, గౌరు కుటుంబానికి జనబలం ఉంది.. అలాగే మాజీ ఎమ్మెల్యేగా కాటసానికి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇద్దరితో చర్చలు జరిపి సమస్యలేకుండా జగన్ ఇక్కడ టికెట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు.. కాని ఎవరికి వారే తమకు టికెట్ అని సొంత కుంపటి పెట్టుకోవడం, పార్టీలో సీనియర్లకు జిల్లా నేతలకు రుచించడం లేదు, సో అదును కోసం టీడీపీ చూస్తోంది ఏరాసు ఇంచార్జ్ గా ఉన్నా, మరి చూడాలి ఇంత క్లిష్టమైన విషయం జగన్ ఎలా పరిష్కరిస్తారో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.