జనసేన వైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ చూపు

Show Jedi Lakshminarayana towards Janasena party

జనసేనలో చాలా మంది నేతలు రావాలి అని క్యూ కడుతున్నారు… ముఖ్యంగా పవన్ భావాలు సిద్దాంతాలు నచ్చి వచ్చేవారు చాలా మంది ఉన్నారు.. అలాంటి జాబితా ఇంకా ఇప్పుడు రెట్టింపు అవుతోంది ..అయితే ఎన్నికల ముందు వచ్చినా పార్టీ సింగిల్ గా ఎవరితో పొత్తులు లేకుండా వెళుతోంది. కాబట్టి జనాకర్షనమెండుగా ఉంటుంది అని చెప్పాలి… ఇప్పుడు జనసేనలోకి మరో కీలక నాయకుడు చేరుతున్నారు అని తెలుస్తోంది. ఆయన వేసిన అడుగులు ఇప్పటి వరకూ చాలా జాగ్రత్తగా ఉన్నాయి, అలాంటి అడుగుల్లో మరో కీలక అడుగు వేయనున్నారు అని తెలుస్తోంది.

అతనే మాజీ సిబిఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ.అయితే ఈయన ఏ పార్టీతోని కలవట్లేదు అని తాను కొత్త పార్టీ పెట్టబోతున్నాను అని తేల్చి చెప్పేసారు.కానీ ఆ తర్వాత మాత్రం నెలలు గడుస్తున్నా సరే ఆ ఊసే ఎత్తలేదు, ఇక లోక్ సత్తాలో ఆయన కొత్త పార్టీని కలుపుకోమని ఆఫర్ వచ్చింది.. సో ఆయన కొత్త పార్టీకన్నా జనసేనలో చేరాలి అని భావిస్తున్నారట.. పవన్ అవినీతికి దూరం, ఆర్బాటాలకు దూరం, యువత వెనుక ఉన్నారు.. ఇవన్నీ ఆయన ఆలోచించి జనసేనలో చేరాలి అని అనుకుంటున్నారట.

పైగా ఆయన ఉద్యోగరిత్యా చేసిన సర్వీసు కూడా పరిపాలన పరంగా పేదలకు ఎలా ఉపయోగపడాలి అనేది ఈజీగా తెలుసు.. సో రాజకీయంగా ఆయనకు ఇది చాలా మంచి ప్లాట్ ఫామ్ అని, జనసేనలో చేరితే ప్రజలకు సులువుగా రీచ్ అవ్వచ్చు అని, కొత్త పార్టీని ప్రజల్లోకి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకువెళ్లడం అనేది పెద్ టాస్క్… సో ఆయన ఆలోచనలు ఇటుగా ఉన్నాయి అనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక మరో మాజీ ఐపీఎస్, అలాగే మరో మాజీ డీజీపీ, ఇక మరో రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్, కూడా జనసేనాని పార్టీలో చేరాలి అని చూస్తున్నారట.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.