Cinetollywood

మహా సముద్రం:సినిమా రివ్యూ

నటులు:శర్వానంద్,సిద్ధార్థ్,అదితిరావు హైదరి,అను ఇమ్మాన్యుయేల్,జగపతి బాబు,రావు రమేశ్దర్శకుడు: అజయ్ భూపతిసినిమా శైలి:Telugu, Romance, Action, Drama

వైజాగ్‌లో ఉండే అర్జున్‌(శ‌ర్వానంద్‌), విజ‌య్‌(సిద్ధార్థ్‌) చిన్న‌ప్ప‌టి నుంచి ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా వ్యాపారం చేయాల‌నుకుంటాడు. తండ్రి చ‌నిపోవడంతో అనాథగా పెరిగిన విజ‌య్ పోలీస్ ఆఫీస‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. మ‌హాల‌క్ష్మి(అదితి రావు హైద‌రి)ని ప్రేమిస్తాడు. ఇంట్లో త‌న‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌ని పెళ్లి చేసుకోవాల‌ని మ‌హాలక్ష్మి పోరు పెడుతున్నా కూడా విజ‌య్ ప‌ట్టించుకోడు. ఉద్యోగం రావాల‌ని చెబుతుంటాడు. అర్జున్‌, అత‌ని త‌ల్లి(శ‌రణ్య‌) కూడా విజ‌య్‌కు ఉద్యోగం వ‌స్తే తామో ఇంట్లో మాట్లాడి పెళ్లి చేస్తామ‌ని మ‌హాల‌క్ష్మికి చెబుతారు. వీరి జీవితాలు ఇలా సాగుతుంటాయి.

మ‌రో వైపు గూని బాజ్జీ(రావు ర‌మేశ్‌) ముప్పై ఏళ్లు క‌ష్ట‌ప‌డి వైజాగ్ స‌ముద్రంలో త‌న చీక‌టి వ్యాపారాల‌ను విస్త‌రిస్తుంటాడు. అదే స‌మ‌యంలో అత‌ని త‌మ్ముడు ధ‌నంజ‌య్‌(రామ‌చంద్ర‌రాజు) వ‌చ్చి అత‌న్ని డ‌మ్మీని చేసి వ్యాపారాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకుంటాడు. వీరిద్ద‌రి నుంచి ఆ వ్యాపారాన్ని తాను హ‌స్త‌గ‌తం చేసుకుని వైజాగ్‌కు కింగ్ కావాల‌ని చుంచు మామ‌(జ‌గ‌ప‌తిబాబు) అనుకుంటుంటాడు. కానీ అత‌ని బ‌లం, బ‌ల‌గం లేక‌పోవ‌డంతో ఏదో చిన్న‌గా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అనుకోకుండా ఓసారి విజ‌య్‌, ధ‌నంజ‌య్‌కి గొడ‌వ జ‌ర‌గుతుంది. ఆ గొడ‌వ‌లో ధ‌నంజ‌య్ గాయ‌ప‌డి స్పృహ కోల్పోతాడు. అత‌ను చనిపోయాడ‌నుకుని విజ‌య్ భ‌య‌ప‌డి విష‌యాన్ని చుంచు మామ‌, అర్జున్‌ల‌కు చెబుతాడు. వారిద్ద‌రూ అత‌న్ని వైజాగ్ విడిచి పెట్టి వెళ్లిపోమ‌మ్మ‌ని అంటారు. మ‌హల‌క్ష్మిని కూడా తీసుకెళ్లిపోమ్మ‌ని అర్జున్ చెప్ప‌డ‌మే కాకుండా ఆమెను ఇంటి నుంచి రైల్వే స్టేష‌న్‌కు తీసుకొస్తాడు. కానీ విజ‌య్ ఆమెను వ‌దిలేసి వెళ్లిపోతాడు

విజ‌య్ కార‌ణంగా ఆమె గ‌ర్భ‌వ‌తి అవుతుంది. ఆ విష‌యం విజ‌య్‌కు కూడా తెలియ‌దు. ఈలోపు గాయం నుంచి కోలుకున్న ధ‌నంజ‌య్‌.. విజ‌య్ క‌నిపించ‌క పోయేస‌రికి మ‌హాల‌క్ష్మిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అర్జున్ అడ్డుప‌డ‌తాడు. ఆ గొడ‌వ‌లో ధ‌నంజ‌య్‌ను అర్జున్ చంపేస్తాడు. అర్జున్‌ను కాపాడ‌టానికి చుంచు మామ ఆ శ‌వాన్ని మాయం చేస్తాడు. అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తే జైలు నుంచి విడిపిస్తాడు. త‌మ్ముడు చ‌నిపోతే తాను వైజాగ్ కింగ్ అవుదామ‌నుకున్న బాబ్జీకి అర్జున్ అడ్డంగా నిల‌బ‌డి వైజాగ్ స‌ముద్రానికి రాజు అవుతాడు. అత‌నికి చుంచు మామ స‌పోర్ట్ చేస్తాడు. త‌మ్ముడు చ‌నిపోతే ఆ స్థానం త‌న‌ద‌వుతుంద‌నుకున్న బాబ్జీ ఏం చేస్తాడు. అత‌నిపై ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంటాడు. అస‌లు విజ‌య్ ఎక్క‌డికి వెళ‌తాడు. వైజాగ్ తిరిగొస్తాడా? అర్జున్‌, విజ‌య్‌లు ఏమౌతారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

మ‌హా స‌ముద్రం అనేది ఓ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరి.. క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. రాసుకోండి.. అంటూ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఛాలెంజ్ చేశాడు. శ‌ర్వానంద్ కూడా అంతే కాన్ఫిడెంట్‌గా సినిమా ష్యూర్ షాట్ హిట్ అని చెప్పాడు. మ‌రి సినిమా ఆ రేంజ్‌లో ఉందా? క‌చ్చితంగా లేద‌నే చెప్పాలి. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి త‌న తొలి చిత్రం RX 100ను తెర‌కెక్కించినంత గొప్ప‌గా మ‌హా స‌ముద్రంను తెరకెక్కించ‌లేదు. సినిమాలో ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరి అని చెప్పారు కానీ.. అంత సీన్ అయితే స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. ఏదో సినిమా ర‌న్ అవుతుందంటే ర‌న్ అవుతుందనేలా ఉంది.

పాత్ర‌ల తీరు తెన్నులను ప‌రిశీలిస్తే.. అర్జున్ పాత్ర‌లో ఏముంద‌ని శ‌ర్వానంద్ ఒప్పుకున్నాడ‌బ్బా అని సాధార‌ణ ప్రేక్ష‌కుడికి అనిపిస్తుంది. హీరోయిజంను ఎలివేట్ చేసేలా రెండు, మూడు ఫైట్స్ మిన‌హా త‌న పాత్ర‌లో కొత్త‌ద‌నం అయితే క‌నిపించ‌దు. ఇది వ‌ర‌కు శ‌ర్వానంద్ చేసిన ర‌ణ‌రంగం సినిమాలో కూడా త‌న పాత్ర ఇలాగే ఏదో ఉందంటే ఉంద‌నిపించేలా ఈ సినిమాలో క‌నిపించింది. తెలుగులో రీలాంచ్ కావాల‌నుకుని తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన సిద్ధార్థ్ ఈ విజ‌య్ పాత్ర‌ను అంగీక‌రించ‌డం వెనుక ట్విస్ట్ ఏంటో అర్థం కాలేదు. ఇంట‌ర్వెల్ ముందు వ‌ర‌కు క‌న‌ప‌డే ఆ పాత్ర‌లో సెకండాఫ్ సగానికి పైగా అయిపోయిన త‌ర్వాత క‌నిపిస్తుంది. ఓ ర‌కంగా గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో సిద్ధార్థ్ క‌నిపించాడు. హీరో త‌న‌కు అన్యాయం చేశాడ‌నుకుని ఎదురు తిరుగుతాడు. పోనీ చివ‌రి వ‌ర‌కు ఆ పాత్ర‌లో సిద్ధార్థ్ చివ‌రి వ‌ర‌కు క‌నిపిస్తాడా? అంటే హీరో ఔన‌త్యాన్ని తెలుసుకుని మారిపోతాడు. మ‌రి ఆ పాత్ర‌లో ఉన్న కొత్త‌ద‌న‌మేంటో ఆయ‌న‌కే తెలియాలి. ఇక అదితిరావు హైద‌రి క‌నిపించే కొద్దిసేపు ఏడుస్తూ, కోపంతో క‌సురుకుంటూ క‌నిపించింది. ఆమె పాత్ర‌లోనూ ప్రేక్ష‌కుడి క‌నెక్ట్ అయ్యేంత ఎమోష‌న్ వెతికినా క‌నిపించ‌దు. కె.జి.య‌ఫ్‌లో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న రామ‌చంద్రరాజు అదే త‌ర‌హా సీరియ‌స్ విల‌నిజాన్ని ఈ సినిమాలో చూపించాడు. చుంచు మామ‌గా జ‌గ‌ప‌తి బాబు చేసిన పాత్ర ఓకే.. పాత్రకు ఎంత న్యాయం చేయాలో దాన్ని జ‌గ‌ప‌తిబాబు చేశార‌నాలి. ఇక సినిమాలో కాస్తో కూస్తో ఆక‌ట్టుకునే పాత్ర ఏదైనా ఉందా? అంటే గూనీ బాబ్జీగా చేసిన రావు ర‌మేశ్ పాత్ర‌. ఈ పాత్ర‌కు రావు ర‌మేశ్ త‌న‌దైన శైలిలో, హావ భావాల‌తో ప్రాణం పోశాడు. అను ఇమ్మాన్యుయేల్ పాత్ర గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచింది. మ‌రో హీరోయిన్ ఉండాలంటే ఉండాల‌నే రీతిలో ఆ పాత్ర క‌నిపిస్తుంది. వైవా హ‌ర్ష న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడంతే. ఇక శ‌ర‌ణ్య‌, ఇత‌ర పాత్ర‌ధారులు వారి పాత్ర‌ల్లో మెప్పించారు.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.