శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూ

Shailaja-Reddy-Alludu-Review

నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్‌, ర‌మ్య‌కృష్ణ‌, సీనియ‌ర్ న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు, ముర‌ళీశర్మ‌, పృథ్వీ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: ర‌వీంద‌ర్‌
నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పిడివి.ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: మారుతి

!!ఇంట్రో!!

ల‌వ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తూ త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ ఫాలోయింగ్ ఏర్పాటుచేసుకున్న నాగ చైత‌న్య, ఇప్పుడు క‌మ‌ర్షియ‌ల్ హీరో అవ్వాలి అని అనుకుంటున్నారు, అందుకే ఇప్పుడు కామెడీ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతీతో సినిమా చేసి విడుద‌ల చేశాడు. ఇంత‌కీ ఈ సినిమా సాంగ్స్ ట్రైల‌ర్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి మ‌రి శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో ఈ సినిమాలో చైతు ఎలా అల‌రించాడో చూద్దాం..

క‌థ:
పెద్ద బిజినెస్ మేన్ రావ్‌(ముర‌ళీశర్మ‌)కు చాలా ఇగో ఉంటుంది. ప్ర‌తి చిన్న విష‌యానికి ఆయ‌న ఇగో ఫీల‌వుతుంటారు. ఆయ‌న ఇగో కార‌ణంగా కూతురి పెళ్లి కూడా ఆగిపోతుంది. అయితే రావ్ కొడుకు చైత‌న్య అక్కినేని నాగ‌చైత‌న్య మాత్రం తండ్రి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటాడు. త‌ను అను అను ఇమ్మాన్యుయేల్‌)ను ప్రేమిస్తాడు. ఆమె ఓ ఆర్టిస్ట్‌(పెయింట‌ర్‌). అను మంచి అమ్మాయే అయినా ఆమెలో విప‌రీత‌మైన ఇగో ఉంటుంది. ఆ కార‌ణంగా చైతుపై ప్రేమ‌ను చెప్ప‌డానికి కూడా ఆలోచిస్తుంటుంది. చివ‌ర‌కు ఎలాగో చైతు ఆమెతో ఐ ల‌వ్ యూ చెప్పించుకుంటాడు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం చైతు తండ్రికి తెలుస్తుంది. అయితే ఆమెలోని ఇగో చూసి ఆయ‌న కూడా అనుని త‌న కోడలు చేసుకోవ‌డానికి అంగీక‌రిస్తాడు. ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో ఇగో హార్ట్ కావ‌డంతో అక్క‌డే చైతు, అనుకి ఇష్టం లేక‌పోయినా నిశ్చితార్థం జ‌రిపించేస్తాడు. కానీ అప్పుడే అను గురించి అస‌లు నిజం అంద‌రికీ తెలుస్తుంది. వ‌రంగ‌ల్‌కి చెందిన శైల‌జారెడ్డి(ర‌మ్య‌కృష్ణ‌) కూతురే అను. ఆమె త‌ల్లి అనుమ‌తి లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని… దాంతో ఇక ప్రేమ గెలిపించుకోవ‌డం కోసం చైతు వరంగ‌ల్ చేరుకుంటాడు. శైల‌జారెడ్డిని చైతూ ఎలా త‌మ పెళ్లికి ఒప్పిస్తాడ‌నేదే అస‌లు క‌థ‌. ఈ క‌థ అంతా తెలియాలి అంటే వెండితెర‌పై చూడాల్సిందే

!!విశ్లేష‌ణ‌!!

సినిమాలో రావ్ అనే పాత్ర ఎంత ఇగోయిస్టిక్‌గా ఉంటుందనే దానిపై సినిమా ఓపెన్ అవుతుంది.. ఇక డిఫ‌రెంట్ ఏమిటి అంటే ప్రేమించిన అమ్మాయికి త‌న తండ్రి ఈగో క్యారెక్ట‌ర్ ఉండ‌టం అనేది ఇక్క‌డ గొప్ప‌గా చూపించారు.. ఇక హీరోయిన్ ఈగోనే అడ్డం పెట్టుకుని త‌న ప్రేమ‌ను స‌క్సెస్ చేసుకునే స్టోరీ లైన్ ఇది బాగా సెట్ అయింది. నాగ‌చైత‌న్య త‌న ప్రేమ కోసం వ‌రంగ‌ల్ వెల్ల‌డం అక్క‌డ నార్మ‌ల్ గా త‌న ప్రేమ స‌క్సెస్ కోసం ప‌డే పాట్లు పాత సినిమా ముచ్చ‌ట‌ని చూపించాయి.

నాగ‌చైత‌న్య పాత్ర ప‌రంగా చ‌క్క‌గా న‌టించారు. ర‌మ్య‌కృష్ణ‌ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెకండాఫ్ అంతా సినిమా ఆమె పైనే న‌డుస్తుంది. ర‌మ్య‌కృష్ణ‌.. శైల‌జారెడ్డి పాత్ర‌ను సునాయ‌సంగా పోషించారు. ఫ‌స్టాప్ కంటే సెకండాఫ్‌లో పృథ్వీ, వెన్నెల‌కిషోర్ కామెడీ స‌న్నివేశాలు ఓకే.. అయితే సాధార‌ణంగా మారుతి తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు సినిమాల్లో హీరో క్యారెక్ట‌ర్ నుండే కామెడీ పుడుతుంది. కానీ ఈ సినిమాలో ఆ స్కోప్ త‌క్కువ‌గా క‌న‌ప‌డింది.

ఇక అను న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ‌తాయి ఫేస్ ఎక్స‌ప్రెష‌న్స్ తో కొన్ని సీన్లు పండాయి అనే చెప్పాలి.. ఇక అనుబేబి సాంగ్ రిచ్ లుక్ క‌నిపించింది.. స్లోనేరేష‌న్ లో వెళ్లినా సినిమా ప‌తాక స‌న్నివేశాలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్ర‌ఫి, అలాగే బాణిలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక సినిమాకు నాగ‌చైత‌న్య న‌ట‌న బాగా ఉప‌యోగ‌ప‌డింది. మొత్తానికి శైల‌జారెడ్డి అల్లుడు మంచి కామెడీ కుటుంబ క‌ధాచిత్రం అనిపించుకుంది.

!!ప్ల‌స్ పాయింట్స్‌!!

న‌టీన‌టులు
సినిమాటోగ్ర‌ఫీ
ఫ‌స్టాఫ్
రెండు పాటలు
చైత‌న్య న‌ట‌న‌

!!మైన‌స్ పాయింట్స్‌!!
బ్యాగ్రౌండ్ స్కోర్‌
కామెడీ అనుకున్నంత లేక‌పోవ‌డం

రేటింగ్ 2.75

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.