
సరిలేరు నీకెవ్వరు రివ్యూ
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్‌రాజు
బ్యానర్స్: జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్
నటీనటులు: మహేశ్, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, సత్యదేవ్, పోసాని, సంగీత, హరితేజ, సుబ్బరాజు, అజయ్, వెన్నెలకిషోర్, రఘుబాబు, బండ్లగణేశ్, పవిత్ర లోకేశ్, రోహిణి, తమన్నా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: అనిల్ రావిపూడి
!! ఇంట్రో !!
టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలా ఉంటాడు మన మహేష్ బాబు, ఇక ఆయన టాలీవుడ్ కే అందగాడు అని అంటారు, ఆయన నటించిన చిత్రాలు వెండితెరపై రికార్డులు నమోదు చేశాయి, ఇక మహేష్ బాబు ఇటీవల సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారు…శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేశారు సూపర్‌స్టార్ మహేష్, ఇక ఆయనతో సినిమా అంటే పక్కా కమర్షియల్ హిట్ అని అందరూ అంటున్నారు,
తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఒక పక్క 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్ అమితాబ్ గా పేరు సంపాదించిన విజయశాంతి తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.. అలాగే పటాస్‌తో డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం సంక్రాంతి బరిలో వచ్చింది, అసలు ఎలా ఉంది ప్రిన్స్ సినిమా ఎలా చేశారు అనేది చూద్దాం.
!!కథ!!
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ మహేశ్ సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మరో వ్యక్తి సత్యదేవ్ జాయిన్ అవుతాడు. ఓ టెర్రరిస్ట్ ఎటాక్‌లో అజయ్ సత్యదేవ్ బాగా గాయపడతాడు. అతను త్వరలోనే చనిపోతాడు కాబట్టి ఆ విషయాన్ని అతని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణయించుకుంటుంది…. అజయ్ తల్లి భారతి విజయశాంతి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. చిన్న తప్పును కూడా భరించని వ్యక్తి తన పెద్దకొడుకు ఆర్మీలో చనిపోయినప్పటికీ చిన్నకొడుకు ఆర్మీకి పంపుతుంది.
కొన్ని విలువల ప్రకారం భారతి చెల్లెలి పెళ్లి చేయడానికి అతని స్థానంలో మేజర్ అజయ్ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ తో కలిసి కర్నూలు బయలుదేరుతాడు. ట్రెయిన్లో సంస్కృతి(రష్మిక).. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న(రావు రమేశ్) ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆమె మేజర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారి నుండి తప్పించుకుని అజయ్ కర్నూలు చేరుకుంటాడు. అక్కడ భారతి, వాళ్ల కుటుంబం కనపడదు. ఆమెను మంత్రి నాగేంద్ర ప్రకాశ్ రాజ్ చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారి బారి నుంచి భారతిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజర్ అజయ్ కృష్ణ. అసలు నాగేంద్రతో భారతికి ఉన్న సమస్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాలనుకుంటాడు? మేజర్ అజయ్ కృష్ణ.. భారతి సమస్యను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
!! విశ్లేషణ !!
ఓ సైనికుడి పరిస్థితిని.. అతని కుటుంబసభ్యులకు సున్నితంగా చెప్పడానికి ఊరికి బయలు దేరిన హీరో, అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడనేది కథ. మహేష్ ఒన్ మ్యాన్ షోగా సినిమాను ముందుకు నడిపించాడు. 13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై విజయశాంతి కనిపించారు. తన యాక్టింగ్ అలాగే ఉంది అని నిరూపించుకున్నారు లేడి అమితాబ్.లొకేషన్లు, సెట్స్ అన్నీ బావున్నాయి. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. అనే డైలాగ్ అందరని ఆకట్టుకుంది.
రష్మిక ఫ్యామిలీ సీన్లు కాస్త డ్రమటిక్‌గా కనిపించాయి. బండ్ల గణేష్ సీన్ కనిపించనంత సేపు నవ్వించింది. సంగీత, రావు రమేష్ పాత్రలన్నీ బావున్నాయి. పాటలు కూడా స్క్రీన్ మీద కలర్ఫుల్గా ఉన్నాయి. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే, ఈ మూవీలో స్టెప్స్‌ని బాగా డిజైన్ చేశారు. అంతేకాదు కలర్ ఫుల్ గా రిచ్ లుక్ అనేది సినిమలో కనిపించింది, మొత్తం నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో ఈ ఫ్రేమ్స్ చెబుతాయి.
అబ్బాయి మీద కలిగిన ఇష్టాన్ని అమ్మాయి వ్యక్తం చేయడం ఈ చిత్రంలో అద్బుతంగా రాశారు. ఆర్మీలో శిక్షణ గురించి పలు సినిమాల్లో రకరకాలుగా చూపించారు. కానీ అదే శిక్షణకు మాట రూపమిచ్చి క్లైమాక్స్ లో చెప్పించడం బావుంది. దేశం గురించి, దేశాన్ని అమ్మతో పోల్చడం గురించి రాసుకున్న డైలాగులు కూడా మెప్పిస్తాయి. పిల్లలపై సీరియళ్ల ప్రభావాన్ని ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం. విలనిజాన్ని బిల్డప్ చేసిన తీరు బాగానే ఉంది
అలాగే నల్లమల అడవుల్లో ఫైట్‌ను చాలా చక్కగా డిజైన్ చేశారు. మిగిలిన ఫైట్స్‌ను కమర్షియల్ ఫార్మేట్లో బాగా డిజైన్ చేశారు. దేవిశ్రీ సంగీతంలో సరిలేరు టైటిల్ ట్రాక్, మైండ్ బ్లాక్ సాంగ్స్ బావున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బావుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
!!ప్లస్ పాయింట్స్ !!
మహేష్
స్టోరీ డైలాగులు
పాటలు
!! మైనస్ !!
కొన్ని పాత్రలు
!! రేటింగ్3.5 !!
!! బాటమ్ లైన్!! సరిలేరు నీకెవ్వరు ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్