Cinetollywood

సమ్మోహనం రివ్యూ

Sammohanam Review

నిర్మాణ సంస్థ‌: శ‌్రీదేవి మూవీస్‌
తారాగ‌ణం: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, , త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
కూర్పు: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: పి.జి.విందా
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌

ఇంట్రో ..
మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి క‌థ‌ల‌ను అద్బుతంగా తెర‌కెక్కించ‌డంలో గొప్ప‌ద‌ర్శ‌కుడు.. తెర‌పై ఏమి చూపించాలి అని అనుకుంటాడో అందంగా చూపించే క‌ళాకారుడు ఇంద్ర‌గంటి..తొలి చిత్రం గ్ర‌హ‌ణం నుండి నేటి వ‌ర‌కు ఆయ‌న పంథాలో మార్పు లేదు. అంద‌మైన క‌థ‌ల‌ను చిత్రాలుగా మ‌లిచారు.ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌రో ప్రేమ‌క‌థా చిత్రం `సమ్మోహ‌నం.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విష‌యాన్ని ప్రెజెంట్ చేస్తూనే సినిమా వాళ్ల ప‌రిస్థితులను కూడా అందంగా, అంద‌రూ న‌వ్వుకునేలా తెర‌కెక్కించారు ఇంద్ర‌గంటి.. మ‌రి ఆయ‌న సినిమాతో మ‌న‌ల్ని స‌మ్మోహ‌న‌ప‌రిచారా లేదా అనేది చూద్దాం.
క‌థ‌:
విజ‌య్‌కుమార్ !! సుధీర్‌బాబు!! చైల్డ్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌. త‌న‌కు సినిమా వాళ్లంటే ఇష్టం ఉండదు. వారు సినిమాలో చూపించేదంతా న‌టనే.. వారికి ఎమోష‌న్స్ ఉండ‌వు .. అనేటువంటి భావ‌న‌లుంటాయి. అయితే విజ‌య్ తండ్రి శ‌ర్వా !!సీనియ‌ర్ న‌రేశ్‌!! కి మాత్రం సినిమాలంటే ఎంతో అభిమానం ఉంటుంది. రిటైర్మెంట్ అయినా త‌ర్వాత సినిమాల్లో రాణించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. త‌ను ఓ సంద‌ర్భంలో సినిమా యూనిట్‌కు వాళ్ల ఇంటికి ఫ్రీగా అద్దెకిస్తాడు. అయితే సినిమాలో త‌న‌కో క్యారెక్ట‌ర్ ఉండాలే నిబంధ‌న పెడతాడు.

ఆ సినిమాలో హీరోయిన్ స‌మీరా రాథోడ్‌(అదితిరావు హైద‌రి). ఈమెకు తెలుగు రాదు. విజ‌య్‌ని త‌న సినిమాకు తెలుగు డైలాగ్స్ నేర్పించ‌మ‌ని కోరుతుంది స‌మీరా… విజ‌య్ కూడా స‌రేనంటాడు. అలా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. స‌మీర కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌దు. విజ‌య్ చెప్పిన ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తుంది. దాంతో విజయ్ డిస్ట్ర‌బ్ అవుతాడు. తిరిగి విజ‌య్ మామూలు మ‌నిషి అవుతాడా? అస‌లు స‌మీరా.. విజ‌య్ ప్రేమ‌ను ఎందుకు తిర‌స్క‌రిస్తుంది? ఇద్ద‌రూ ఒక‌ట‌వుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:

సినిమా క‌థ కొత్త‌గా ఎంచుకున్నారు.. సినిమాపై అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు కానే ఇంద్ర‌గంటి అందంగా తెర‌కెక్కించారు ఈ చిత్రాన్ని.. సినిమాలో డైలాగులు బాగున్నాయి.. క‌థ‌కు త‌గ్గ‌ట్లు మాట‌లు బాగా రాశారు..మ‌రోవైపు హీరో తో పాటు హీరో త‌ల్లి త‌దిత‌ర పాత్ర‌లన్నీ ఇంగ్లిష్‌లో సంభాష‌ణ‌లు చెప్ప‌డం కాసింత అస‌హ‌జంగా అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీని అప్ప‌ర్ మిడిల్ క్లాస్‌గా చూపించారు కాబ‌ట్టి ఫ‌ర్వాలేద‌నుకోవ‌చ్చు. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చాలా బాగా కుదిరింది. ఇక పాట‌లు కూడా బాగా అల‌రించాయి స్వ‌రాలు అద్బుతంగా అందించారు.

నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి..కెమెరా వ‌ర్క్స్ గురించి ప్ర‌స్తావించాల్సిందే.. అద్బుతంగా ఉంది..సుధీర్‌బాబు గ‌త చిత్రాల‌తో పోలిస్తే మ‌నిషి చాలా బావున్నాడు. . అందంగా త‌న న‌ట‌న‌తో మ‌రింత మెప్పించాడు.. అదితీరావు నోట తెలుగు మ‌రింత మ‌ధురంగా వినిపించింది.. ఇందులో సీనియ‌ర్ న‌రేశ్ పాత్ర అద్బుతంగా ఉంది పాత్ర‌కు ఆయ‌న లీన‌మయ్యేలా న‌టించారు… ఇక చివ‌రిగా సినిమాని అందంగా అలంక‌రించి చిత్రీక‌రించారు అంటారు అద్బుతంగా ఉంది అని చెప్పాలి ఇక కామెడీ కూడా సినిమాకు స‌రిస‌మానంగా అందించారు వారి పాత్ర‌ల‌తో…

ప్ల‌స్ పాయింట్లు
న‌టీన‌టులంద‌రూ బాగా న‌టించారు
సంగీతం బావుంది.
కామెడీ బావుంది
కెమెరా ప‌నిత‌నం
ఆర్ట్ వ‌ర్క్ బావుంది
క‌థ‌, హీరో నేరేష‌న్

మైన‌స్ పాయింట్లు
సెకండాఫ్ పై కాస్త దృష్టిపెట్టాల్సింది

రేటింగ్ 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.