
ఆ విషయం ఇప్పుడు చెప్పను సమంత
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకునే దిశగా ముందుకు వెళుతోంది నటి సమంత….పెళ్లి తర్వాత మరింత బిజీ అయింది అనే చెప్పాలి సమంత. తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా నటిస్తున్న రంగస్థలంలో తానింతవరకూ పోషించనటువంటి గ్రామీణ పాత్రలో నటించానని, అలా అనడం కంటే గ్రామీణ యువతిగా జీవించాననే చెప్పాలని అన్నారు సమంత.
ఇక సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం మహానటిలో తాను పాత్రికేయురాలిగా నటిస్తున్నానని, మరి కొందరు జమున పాత్రలో నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, దాని గురించి అసలు సీక్రెట్ తాను చెప్పదలచుకోలేదు అని ఆమె తెలియచేశారు… అలాగే అందులో ఎటువంటి నిజం లేదు అని ఆమె తెలియచేశారు….ఇక తాజాగా కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్‌లో నటిస్తున్నానని, అయితే దాని ఒరిజినల్ లో నటించిన నటి కంటే విభిన్నంగా తాను నటిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత కన్నడ చిత్రం చూసిన వారు కూడా భిన్నమైన అనుభూతి పొందుతారు అని ఆమె తెలియచేశారు.
తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రం కూడా విడుదలకు ముస్తాబుతోంది. అదే విధంగా శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సీమరాజా చిత్రం శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటోంది… మొత్తానికి బిజీ బిజీగా ఆమె షెడ్యూల్ తో సినిమాలతో సమయం కేటాయిస్తున్నారు అని అంటున్నారు ఆమె అభిమానులు.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు