Cinetollywood

ఆర్‌ఎక్స్‌ 100` మూవీ రివ్యూ

RX100 Telugu Movie Review

జానర్ : రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్, రాంకీ
సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌
నేపథ్య సంగీతం : స్మరన్‌
దర్శకత్వం : అజయ్‌ భూపతి
నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ

!! ఇంట్రో !!

టాలీవుడ్ లో కొత్త గా సినిమాలు తీయాలి …బోల్డ్ సినిమాలు కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు అని తెలిసింది, అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత, ఇక ఈ సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత బోల్డ్ సినిమాల‌ను ద‌ర్శ‌కులు నిర్మాత‌లు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు..అదే జానర్‌లో తెరకెక్కిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ అన్నీ డిఫ‌రెంట్ గా ఉండ‌టంతో అంద‌రూ ఈ సినిమా పై ఎన్నోహోప్స్ పెట్టుకున్నారు.. ఇది రొటిన్ సినిమా కాదు ఇలా రొటీన్ గా సినిమాలు చూడాలి అనుకునేవారు మా సినిమాకి రావ‌ద్దు అంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చేస‌రికి, అందరూ షాక్ అయ్యారు.. పైగా రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన మ‌రో యువ ద‌ర్శ‌కుడు, ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం చేశాడు.. అజయ్‌ భూపతి తొలిసారి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు..కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఆర్‌ఎక్స్‌ 100, ఈరోజు విడుద‌లైంది మ‌రి సినిమా అంచ‌నాలు అందుకుందా ఓసారి వ‌ర్మ మార్క్ క‌నిపించిందా చూద్దాం.

కథ ;
చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ !!కార్తికేయ!! ను డాడీ !!రాంకీ !! అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ. ఊళ్లో గొడవల కారణంగా డాడీకి , విశ్వనాథం రావు రమేష్ తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు ! పాయల్ రాజ్‌పుత్ !!తో ప్రేమ పడతాడు. తన ప్రేమకు డాడీ సపోర్ట్ చేయటంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఒక రోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పి వెళ్లిన ఇందు, తండ్రి చూసిన ఫారిన్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఇందును తన నుంచి దూరం చేశాడని విశ్వనాథం మీద పగ పెంచుకుంటాడు శివ. విశ్వనాథం మనుషులను కొట్టడంతో పాటు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ సైకోలా తయారవుతాడు. అసలు ఇందు, శివను కాదని మరో పెళ్లి ఎందుకు చేసుకుంది..? వీరి ప్రేమకథలో విలన్‌ ఎవరు..? చివరకు శివ ఏమైయ్యాడు అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌..

కొత్త న‌టీన‌టులు అయినా సినిమాకి ప్రాణం పెట్టేశారు అని చెప్పాలి..ప్రమోషన్‌ల సమయంలోనే ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకొని చేశానంటూ చెప్పిన కార్తికేయ, శివ పాత్రకు న్యాయం చేసేందుకు సిన్సియర్‌గా ప్రయత్నించాడు.
ప్రేమించిన వ్యక్తిగా అలాగే ప్రేమ‌ను దూరం చేసుకున్న వ్యక్తిగా అల‌రించాడు..ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది… హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ బాగానే న‌టించింది. ఇక బోల్డ్ సీన్స్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటాయి.. పాట‌లు కూడా క్లాస్ గా ఉన్నాయి. రావుర‌మేష్ పాత్ర పెద్ద‌రికంగా మ‌రోసారి అద‌ర‌గొట్టారు అనే పేరు వ‌చ్చింది.. రాంకీకి పెద్ద‌గా స్కోప్ ఇవ్వ‌లేదు న‌ట‌న‌లో.. ఇక ఈ సినిమా ద‌ర్శకుడు అజ‌య్ భూప‌తి అర్జున్ రెడ్డిని దృష్టిలో ఉంచుకుని తీశాడు అనేది తెలుస్తోంది..ఆరెక్స్ 100 టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టాడు అనేది మాత్రం అర్దం కాలేదు జ‌నాల‌కి..హీరో ఆర్‌ఎక్స్‌ 100 బండి వాడటం తప్ప కథతో టైటిల్‌కు ఏ మాత్రం సంబంధం లేదు…ల‌వ్ ట్రాక్ ని ప‌క్క‌న పెట్టి బోల్డ్ ట్రాక్ ని సూప‌ర్ ఫాస్ట్ లా చూపించాడు ద‌ర్శకుడు… నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.. మొత్తానికి ఆర్ ఎక్స్ బండిలా యువ‌త మాత్రం క‌చ్చితంగా సినిమాకి వ‌స్తారు.
!!ప్లస్ పాయింట్స్ !!
హీరో పాత్ర
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
లొకేష‌న్లు
క‌థ‌
!!మైనస్‌ పాయింట్స్ !!
స్లో నేరేషన్‌
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్‌

రేటింగ్ 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.