
రూలర్ రివ్యూ
నర్: హ్యాపీ మూవీస్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
—ఇంట్రో–
బాలకృష్ణ, నటసింహం నందమూరి వారసుడు, బాలయ్య బాబు సినిమా అంటే అభిమానుల జోష్ ఎలా ఉంటుందో తెలిసిందే.. కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్ కాంబినేషన్లో విజయం సాధించిన చిత్రం జైసింహా ఇదే కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రమే రూలర్. బాలకృష్ణ రెండు షేడ్స్‌లో ఒకటి ఐటీ రంగానికి చెందిన వ్యక్తి.. మరో షేడ్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. మరి బాలయ్య ఇలా చాలా షేడ్స్ లో గతంలో సినిమాలు చేశారు.. కాని ఈసారి లుక్స్ లో మాత్రం హాలీవుడ్ హీరోలా ఉన్నారు, మరి టీజర్ ట్రైలర్ పాటలు దుమ్ముదులిపేశాయి. మరి తాజాగా నేడు సినిమా విడుదల అయింది. ఇందులో ఆయన నటన సినిమా ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం.
కథ
సరోజినీ దేవి(జయసుధ) ఐటీ రంగంలో పెద్ద వ్యాపారవేత్త. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలోని ఓ వ్యక్తి(బాలకృష్ణ)ని ఆమె కాపాడుతుంది. గతం మరచిపోయిన అతనికి అర్జున్ ప్రసాద్ అని పేరు పెట్టి అమెరికాకు పంపి బిజినెస్‌మేన్‌గా తయారు చేస్తుంది. అర్జున్ ప్రసాద్ తన ఐటీ కంపెనీని నెంబర్ వన్ కంపెనీగా మారుస్తాడు. కంపెనీని డెవలప్ చేసే క్రమంలో భాగంగా అర్జున్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్‌లో తమ కంపెనీ ఆపేసిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుని అక్కడకు వెళతాడు. అక్కడ తన తల్లికి జరిగిన అవమానం తెలుస్తుంది. తల్లిన అవమానించిన వారిని అర్జున్ ప్రసాద్ కొడతాడు. అక్కడ నుండి కథ మలుపు తిరుగుతుంది. అందరూ అర్జున్‌ని ధర్మ అని పిలుస్తారు. అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి అర్జున్‌కి తెలిసిన నిజమేంటి? అర్జున్‌కి, ధర్మకు ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ
నిజమే సినిమా ట్రైలర్ టీజర్ లో మాస్ సినిమా అనేది తెలిసింది.. సినిమా కూడా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే తెలుస్తుంది. సినిమాలో బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే, సినిమాను బాలయ్య తనదైన స్టైల్లో ముందుకు తీసుకెళ్లారు. ఆయన స్పీడు చూస్తే నేటి కుర్ర హీరోలకు గట్టి సమాధానం ఇచ్చారనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్‌లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఐటీ కంపెనీ అధినేతగా స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది. రైతుల బ్యాక్‌డ్రాప్, భూమిక పాత్ర, బాలయ్య డాన్య్, డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి.
ఇక ధర్మ అనే పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ పవర్‌ఫుల్‌గా కనపడ్డారు. ప్రకాష్‌రాజ్, జయసుధ నటన ఆకట్టుకుంది. సోనాల్ చౌహాన్, వేదిక గ్లామర్‌తో పాటల్లో అలరించారు. దర్శకుడు అనుకున్న విధంగా యాక్షన్ సీన్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. చిరంతన్ భట్ సంగీతం బావుంది. ఇక బాలయ్య డ్యాన్స్ మరోసారి అభిమానులని ఖుషీ చేసింది. రాంప్రసాద్ కెమెరా పనితనం బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్, ఎడిటింగ్ వర్క్ బావున్నాయి. బాలయ్య డ్రెస్సింగ్ డిజైన్స్ సినిమాకి హైలెట్ .
—బలాలు—
బాలయ్య
స్టోరీ
డైరక్షన్
డ్యాన్సులు
—బలహీనతలు—
కామెడీ ట్రాక్
కథనం నెమ్మదించడం
–బాటమ్ లైన్ —
రెండు పాత్రల్లో బాలయ్య సినిమాకి రూలర్ అయ్యాడు అనే చెప్పాలి
రేటింగ్ 2.75