
పండగుకు ఫ్యాన్స్‌కి ఫీస్ట్? భారీ మల్టీస్టార్ మూవీ టీజర్‌కు ముహూర్తం ఖరారు..RRR Movie
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదలపై ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
‘బాహుబలి’ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం RRRమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా రేంజ్‌లో ఉంటుందో చిన్న శాంపిల్ ఇచ్చాయి. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడింది. ముందుగా ఈ సినిమాను గత ఏడాది అక్టోబర్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్ వాయిదాపడటంతో.. సినిమా విడుదల కూడా వాయిదాపడింది. ఇక ఆ తర్వాత ఈ జనవరిలో విడుదల చేస్తామని మరో విడుదల తేదీని ప్రకటించింది. కానీ, అది వాయిదా వేసి.. అక్టోబర్‌లో విడుదల చేస్తామని అన్నారు. కానీ, లేటెస్ట్‌గా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం ప్రకటన చేసింది.
విడుదల తేదీ వచ్చినప్పటి నుంచి సినిమా నుంచి ఇంకా ఏ అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల అవుతుందని.. సమాచారం తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటివరకూ ఇద్దరు హీరోలవి వేరు వేరుగా టీజర్లు వచ్చాయి. అయితే త్వరలో వచ్చే టీజర్‌లో ఇద్దరు హీరోలు కలిసి ఫీస్ట్ ఇవ్వనున్నారట. ఇక ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గన్, శ్రియ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.
Gallery
Latest Updates
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే
-
రాజమౌళి:Ram Charan తెల్ల కాగితం లాంటివాడు.. తారక్ గురించి అంతా తెలుసు
-
పూర్ణ ప్రధాన పాత్ర లో నటించిన “బ్యాక్ డోర్” సినిమా రివ్యూ
-
అవన్నీ తెలియదన్న డైరెక్టర్…Radhe Shyam విడుదలపై క్లారిటీ
-
Saamanyudu Teaser