
రోబో 2.0 మూవీ రివ్యూ & రేటింగ్
నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజాన్, రియాజ్‌ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంథోని
ఆర్ట్: టి.ముత్తురాజు
వీఎఫ్ఎక్స్ అడ్వైజర్: శ్రీనివాసమోహన్
ఫైట్స్: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్
సంస్థ: లైకా ప్రొడక్షన్స్
!!ఇంట్రో!!
మన చలన చిత్ర సీమలో సినిమా 100 నుంచి 150 కోట్లు అంటే కమర్షియల్ సినిమాలు అంటారు.. కాని 500 కోట్ల పైచిలుకు డబ్బులు పెట్టుబడిగా పెట్టి సినిమా తీశారు అంటే. ఆ నిర్మాతలకు వీరతాళ్లు వేయాల్సిందే.. నిజంగా అంత నమ్మకం పెట్టుకోవడానికి ఒక కారణం శంకర్ అయితే మరో కారణం రజిని అనే చెప్పాలి…నాలుగేళ్ల పాటు శ్రమించి ఈ సినిమాని తెరకెక్కించారు శంకర్. తరచూ వాయిదా పడుతూ వస్తున్నా.. రజనీ అభిమానులు ఎక్కడా నిరుత్సాహ పడకుండా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్షణ ఫలించింది. 2.ఓ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రజనీ – శంకర్ స్థాయికి తగ్గట్టు సాగిందా? రోబోతో పోలిస్తే 2.ఓలో ఉన్న ప్రత్యేకతలేంటి మరి వెండి తెరపై వచ్చిన ఈ సినిమా చూసొద్దాం?
!!కథ !!
హఠాత్తుగా నగరంలోని సెల్ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. ఈ సమయంలో డా.వసీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అయితే సెల్ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్ కుమార్)ను చిట్టి ఒంటరిగా ఎదురించిందా? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పక్షిరాజాలా అక్షయ్ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ!!
సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్ పాత్రలో వసీకరణ్‌గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది.
పక్షిరాజాలా అక్షయ్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అక్షయ్ నటనలోని మరోకోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. అమీ జాక్సన్ తన పరిధి మేర ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు. ఇక తెలుగువారు ఎవరూ కనిపించకపోయినా రజనీ మానియాతో సినిమా అంతా వారి ముగ్గురి చుట్టు నడుస్తుంది అనే చెప్పాలి.
శంకర్ సినిమా సామాజిక స్పృహతో, సందేశాత్మక సినిమాలు చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది కూడా అలాంటి సినిమానే. ఇక ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడి వెండితెరపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సైంటిస్టుగా రజినీ మరోసారి అదరగొట్టారు. అమీ తన అందచందాలతో మంచి పాత్ర చేసింది అనే చెప్పాలి.నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది.
రజనీ ఈ వయసులోను అదరగొట్టే స్టెప్పులతో చించేశారు అని అంటున్నారు అభిమానులు.
!!బలాలు !!
చిట్టి – పక్షిరాజు పోరాటాలు
విజువల్ ఎఫెక్ట్స్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
బడ్జెట్
రజనీ గెటప్ అక్షయ్ నటన క్యారెక్టర్ రోల్
!!బలహీనతలు!!
షాకింగ్ ఎలిమెంట్స్ తక్కువ
కామెడీ
బాటమ్ లైన్!! చిట్టీ 2.0 మళ్లీ లోడ్ అయి తన పని పూర్తి చేసింది?
Cinetollywood.com రేటింగ్ – 3.75