Cinetollywood

ఇద్దరు డైరెక్టర్లకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఎవరంటే

Ravi teja greensignal to two directors

సినిమా ఫైనల్ రిపోర్టు ప్రేక్షకుల నుంచి ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం రవితేజ స్టైల్ …హిట్ ఫెయిల్ లో సంబంధం ఉండదు సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళతాడు రవితేజ అయితే మినిమం మార్కెట్ ఆయనకు ఉండంతో బాక్సాఫీస్ దగ్గర ఆయన చిత్రాలకు పెద్దగా నష్టాలు రావు అంటారు నిర్మాతలు.

ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక రవితేజ సరసన చాలా గ్యాప్ తీసుకుని శృతిహసన్ నటిస్తోంది, అంతేకాదు ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది

అయితే ఈ సమయంలో మరో సినిమాకి ఒకే చెప్పాడు రవితేజ. తాజాగా దర్శకుడు రమేశ్ వర్మ రవితేజకు చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పేశాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ మధ్య హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా రాక్షసుడు తెరకెక్కించింది దర్శకుడు రమేశ్ వర్మనే. తాజాగా రవితేజకు సెట్ అయ్యే కథ వినిపించారట..ఇది నచ్చడంతో ఆయన ఈ చిత్రం ఒకే చేశారు.

అయితే రవితేజ మరో క్రేజీ దర్శకుడికి కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది , ఆయనే నక్కిన త్రినాధరావు,
హలో గురు ప్రేమకోసమే తో మంచి ఫేమ్ సంపాదించుకున్న త్రినాథరావు ఆయనకు కూడా ఒకే చెప్పారట, ఈ సినిమా నిర్మాతలుగా విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల చేయనున్నారు, అయితే వీరిద్దరి చిత్రాలు ఒకే చేశారు , కాని సెట్స్ పై ఏ చిత్రం ముందు పెడతారు అనేది తెలియాలి.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.