Cinetollywood

రణరంగం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Ranarangam review and Rating


కథ : చిరంజీవి అల్లుడా ..మజాకా సినిమా రోజులు. తన ఫ్రెండ్స్ తో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకునే దేవ (శర్వానంద్) హ్యాపిగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ గీత (కళ్యాణి ప్రియదర్శన్). ఎంత కష్టపడినా బ్లాక్ టిక్కెట్లలో మిగిలేది తక్కువే. ఎలా డబ్బులు సంపాదించాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన మధ్యపాన నిషేధం కలిసి వస్తుంది. అప్పుడు ప్రక్క స్టేట్ ఒరిస్సా నుంచి లిక్కర్ స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించటం మొదలెడతాడు. పాల క్యాన్ లో అడుగున దాచి తెచ్చిన లిక్కర్ లక్షలు తెచ్చిపెడుతుంది. అది యూజ్ యూజవల్ గా లోకల్ ఎమ్మల్యే సింహాచలం (మురళి శర్మ) చేసే దొంగ లిక్కర్ వ్యాపారానికి దెబ్బ కొడుతుంది.తన వ్యాపారానికి గండి కొడితే ఎమ్మల్యే ఊరుకుంటాడా..తన మనుష్యులతో దేవపై దాడి చేయిస్తాడు. అక్కడ నుంచి ఆ గొడవలు పెరుగుతూ పోతాయి. దానికి అంతం అనేది ఉండదు.

చివరకు అటు సింహాచలం..ఇటు దేవ ఇద్దరూ తమ సొంత మనుష్యులను సైతం కోల్పోతారు. ఆ క్రమంలో సింహాచంలం మాయమైపోతాడు. దేవా ..అన్ని వ్యాపారాలు కట్టి పెట్టి స్పెయిన్ లో సెటిల్ అవుతాడు. కానీ అతని గతం అతన్ని తిరిగి వెనక్కి పిలుస్తుంది. కొన్ని సెటిల్మెంట్స్ చేయాల్సిన పరిస్దితి క్రియేట్ చేస్తుంది. ఆ క్రమంలో ఏమైంది..మాయమైన సింహాచలం సంగతి ఏమైంది… తన గర్ల్ ప్రెండ్ గీతతో దేవ వివాహం అయ్యిందా..స్పెయిన్ సెటిలైన దేవా ఎందుకు మళ్లీ గన్ పట్టాల్సి వచ్చింది.స్క్రీన్ ప్లేనే దెబ్బ ఈ సినిమా మొత్తం కాస్సేపు గతం, మరి కాసేపు వర్తమానం అంటూ సాగుతుంది. అలాగని రెండు కథల్లో ఏదన్నా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటా అదీ ఉండదు.

గతం ప్రభావం వచ్చి పోని ఇప్పుడు జరుగుతున్న వర్తమానం సీన్స్ పై డైరక్ట్ గా ఉంటుందా అదీ ఉండదు. చూసే వాళ్లకు స్ట్రైన్ పెట్టడం తప్పించి ఆ స్క్రీన్ ప్లే వల్ల ఈ సినిమా సాధించిందేమీ కనపడదు. అలాగే సినిమాలో ఎక్కడా సరైన నెగిటివ్ ఫోర్స్ ఉండదు. మురళి శర్మ పాత్ర ..సినిమా ప్రారంభానికే పెద్ద వయస్సు వచ్చి ఉంటుంది. ఆ పాత్ర ..అప్పుడప్పుడే ఎదుగుతున్న దేవా పాత్రని ఏమీ చేయాలని మనకు అర్దమవుతుంది. దాంతో హీరో చేసే పనులు అడ్డుకునేవాళ్లుకానీ, అతన్ని కొట్టేవాళ్లు గానీ ఉండరు. దాంతో సెకండాఫ్ మొత్తం హీరో క్యారక్టరైజేషన్ పూర్తిగా యాక్టివ్ ప్యాసివ్ గా ఉంటుంది.

అంటే యాక్షన్ లో ఉన్నట్లు ఉంటుందని కానీ కథనేమి కదపలేదు.మాట్లాడితే గన్స్ పట్టుకుని తిరిగుతూ డైలాలుగు చెప్పే పాత్రలు తప్ప ఏమీ ఉండదు. అసలు కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా కొంత దూరంవెళ్లాక అర్దం కాకుండాపోతుంది. అలాగే అన్నిటికన్నా విషాదకరమైన అంశం ఏమిటంటే ..దేవా పాత్రను మనం పొరపాటున కూడా ప్రేమించం…అతను గెలవాలని కానీ, బ్రతకాలని కానీ కోరుకోం. తెరపై కనపడే జీవం లేని గన్ లాగానే అదీను అనిపిస్తుంది. అదే గాడ్ ఫాదర్ ని మనం ఇంతకాలం గుర్తుపెట్టుకోవటానికి కారణం….ఆ పాత్రని మనం ఇష్టపడటమే. ఆ విషయంలో డైరక్టర్ స్క్రిప్టు దశలోనే ఫెయిలయ్యాడు.డైరక్టర్ గా సుధీర్ వర్మ మేకింగ్ తో మ్యాజిక్ చేయగలననే నమ్మకంతో ఈ సినిమా చేసినట్లుంది.

స్టైలిష్ గా సీన్స్ డీల్ చేసినంత మాత్రాన అందులో కంటెంట్ లేకపోతే భరించటం కష్టమే విషయం మర్చిపోయినట్లున్నాడు.హీరో,హీరోయిన్స్ శర్వానంద్..యువకుడుగా ఉన్నప్పటి పాత్రలో చాలా చేసాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. అయితే ఓ వయస్సు వచ్చిన నడి వయస్సు డాన్ గా మాత్ర నప్పలేదు. ఆర్టిఫిషియల్ గా ఉన్నాడు. హీరోయిన్స్ లో కాజల్ గురించి మాట్లాడటానికి ఆమెకు అసలు పాత్రే లేదు. ఉన్న కాసేపు ఏదో అలా నామ మాత్రంగా చేసుకుంటూ పోయింది. కళ్యాణి ప్రయదర్శిని మాత్రం బాగా చేసింది.

ఇక విలన్ గా చేసిన మురళి శర్మ చాలా దారుణంగా ఉన్నాడు చూపులకు.టెక్నికల్ గా ప్రశాంత్ పిళ్లై అందించిన పాటలు అద్బుతం కాదు కానీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి లుక్ తెచ్చిపెట్టింది. ఎడిటింగ్ మాత్రం ఇంకొంత లేపేయాలి సెకండాఫ్ లో అనిపించింది. అయితే వీళ్ళందిరినీ కలుపుకుని పోయే డైరక్షన్, రైటింగ్ మాత్రం సరిగ్గా లేకపోవటంతో ఇవన్ని వృధా అయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

Rating: 2/5

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.