
చివర్లో మాత్రం పవన్ కళ్యాణ్ హైలెట్.. ఎవడాడు అంటూ రానా ఫైర్… Swag of Daniel Shekar
నేడు (డిసెంబర్ 14) రానా బర్త్ డే. ఈ సందర్బంగా భీమ్లా నాయక్ నుంచి రానా పాత్రకు సంబంధించిన వీడియోను వదిలారు. ఇందులో రానా క్యారెక్టరైజేషన్ గురించి వివరించే
పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్‌లో రాబోతోన్న మళయాలి రీమేక్ భీమ్లా నాయక్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. జనవరి 12న కచ్చితంగా థియేటర్లోకి వస్తామని పదే పదే మేకర్లు చెబుతూనే ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి సినిమాలు బరిలోకి ఉన్నాయని, కాస్త సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకోమని భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. కానీ భీమ్లా నాయక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పేశారట. అయితే తాజాగా మరోసారి ఆ విషయాన్ని స్వాగ్ ఆఫ్ డానియల్ శేఖర్ రూపంలో చెప్పేశారు.
నేడు (డిసెంబర్ 14) రానా బర్త్ డే. ఈ సందర్బంగా భీమ్లా నాయక్ నుంచి రానా పాత్రకు సంబంధించిన వీడియోను వదిలారు. ఇందులో రానా క్యారెక్టరైజేషన్ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ‘వాడు అరిస్తే భయపడతానా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ ఐ.. సస్పెండెడ్’ అంటూ రానా రెచ్చిపోయాడు.
కానీ విజువల్‌గా మాత్రం ఇది భీమ్లా నాయక్ కారెక్టర్‌కు హైప్ ఇచ్చినట్టే అనిపించింది. రానా బర్త్ డే అయినా కూడా పవన్ కళ్యాణ్ హైలెట్ అయ్యేలానే వీడియోను వదిలారంటే.. సినిమా మొత్తం ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో చాలానే మార్పులు చేసినట్టు ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ పక్కన నిత్య మీనన్ నటిస్తోంది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్