
రాజమౌళి:Ram Charan తెల్ల కాగితం లాంటివాడు.. తారక్ గురించి అంతా తెలుసు
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను రాజమౌళి వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఈ టీం అంతా కూడా ఇప్పుడు ముంబైలో చక్కర్లు
రాజమౌళి ప్రస్తుతం తన RRR సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాడు. అందుకే గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్నాడు. నేషనల్ మీడియాతో తన ఇద్దరు హీరోలతో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రామజౌళి తన హీరోల గురించి చెప్పుకొచ్చాడు. సెట్‌లో ఎవరు ఎక్కువగా ఆశ్చర్యపరిచారో చెబుతూ రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.
నాకు ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలుసు. ఎప్పుడు ఎలా ఉంటాడు.. ఏం చేస్తాడు.. ఏం చేయాలని అనుకుంటాడు.. ఓ కథ చెప్పినప్పుడు ఏం ఆలోచిస్తాడు.. సీన్ చెబితే ఎలా నటిస్తాడు.. ఇవన్నీ నాకు తెలుసు.. కానీ రామ్ చరణ్ మాత్రం అలా కాదు.. నన్ను చాలా ఆశ్చర్యపరిచేవాడు. రామ్ చరణ్ సెట్‌కు ఖాళీ మైండ్‌తో వచ్చేవాడు.
బ్రెయిన్‌లో ఏ ఒత్తిడి పెట్టుకోకుండా.. ఓ వైట్ పేపర్‌లా వస్తాడు.. మనకు ఓ వైట్ పేపన్, పెన్ ఇచ్చినట్టు ఇస్తాడు.. అందులో ఏం కావాలో ఇక రాసుకో అన్నట్టు వదిలేస్తాడు.. మనకు ఏం కావాలో అలా నటించేస్తాడు. అలా రామ్ చరణ్ నన్ను చాలా సార్లు ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఎవరి స్టైల్లో వారు నటించేశారు.
చాలా సార్లు ఇద్దరూ కూడా నేను ఊహించిన దానికి, అనుకున్న దాని కంటే గొప్పగా చేశారు. అది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇక సెట్‌లో అయితే ఈ ఇద్దరూ తెగ అల్లరి చేసేవారు. అలియా భట్ మాత్రం ఎంతో క్రమశిక్షణతో ఉండేది అంటూ రాజమౌళి తన టీం గురించి చెప్పుకొచ్చాడు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్