Cinetollywood

ఆర్ .ఆర్ .ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే మతిపోతుంది

R R R movie pre business mind blowing

టాలీవుడ్ లో ఇప్పుడు బాగా టాక్ నడుస్తున్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే చెప్పాలి.. చరణ్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈచిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అందరూ… బాహుబలి వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నారు.

ఇక ముందు అనుకున్న సమయానికి కాకుండా వచ్చే ఏడాది జనవరికి ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది ..అయితే అది పక్కా అనే చెప్పాలి.. ఎందుకు అంటే సంక్రాంతి బరిలో సినిమా కాబట్టి కచ్చితంగా విడుదల చేయాలి అని చూస్తున్నారు.. విడుదల జనవరి 8 అని ప్రకటన ఇచ్చారు. కాబట్టి ఈ చిత్రం పై హోప్స్ మరింత పెరిగాయి.

ఇక జక్కన్న కొన్ని సీన్ల విషయంలో ఆలస్యం అయినా బాగా రావాలి అని కాస్త సమయం తీసుకున్నారట.. ఈ సినిమాని ముందుగానే బయ్యర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యిందని వార్తలు వినపడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నైజాం థియేట్రికల్ హక్కులను రూ.72 కోట్లకు దిల్రాజు దక్కించుకున్నారని టాక్ నడుస్తోంది. అలాగే ఆంధ్ర హక్కులను రూ.100 కోట్లకు మరో బడా వ్యక్తి దక్కించుకున్నారని టాక్… అయితే ప్రి రిలీజ్ మార్కెట్ దాదాపు సంవత్సరం ముందే ఇంత పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిసి మిగిలిన నిర్మాతలే షాక్ అవుతున్నారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.