
బండ్ల గణేష్ ఎంట్రీతో గందరగోళం.. పూరిపై ప్రశ్నల వర్షం..ముగిసిన ఈడీ విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అందరిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్లు సుప్తావస్తలో ఉన్న ఈ కేసును ఇప్పుడు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పరుగులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అందరిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. నాలుగేళ్లు సుప్తావస్తలో ఉన్న ఈ కేసును ఇప్పుడు ఈ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) పరుగులు పెట్టిస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారించేందుకు ఈడీ సిద్దమైంది. ఈక్రమంలోనే పూరి జగన్నాథ్‌ను నేడు (ఆగస్ట్ 31) ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఈడీ కార్యాలయంలో పూరి విచారణ ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది.
అయితే మళ్లీ పూరి జగన్నాథ్‌ను పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పూరి జగన్నాధ్ ను ప్రశ్నించారు. పూరీ కి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల తో ఉన్న సంబంధాల పై ఈడీ ఆరా తీశారు.. విదేశాల నుండి డ్రగ్స్ కొనుగోళ్లు ఏ రూపంలో జరిగాయని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు ఈడీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది
పూరీ జగన్నాధ్ కు సంబంధించి మూడు బ్యాంక్ ఎకౌంట్లను పరీశీలించినట్టు సమాచారం. పూరి జగన్నాధ్‌కు సంబంధించిన వైష్ణో బ్యానర్, పూరి కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రీపోర్ట్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ స్టేట్ మెంట్ లిఖిత పూర్వకంగా ఎనిమిది పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా సమాచారం. ఈడీ అధికారులు తదుపరి విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని ఆదేశం ఇచ్చారు. దీంతో తాను విచారణకు సహకరిస్తానని.. కచ్చితంగా హాజరవుతామని పూరి జగనాథ్ హామీనిచ్చినట్లు సమాచారం.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్