
ప్రతిరోజూ పండగే రివ్యూ
నటీనటులు: సాయి తేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, రజిత, విజయ్‌కుమార్, అజయ్, మురళీశర్మ, ప్రవీణ్, మహేష్, శ్రీకాంత్ అయ్యర్, భద్రమ్, సుహాస్ తదితరులు
సంగీతం: తమన్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: జైకుమార్ సంపత్, ప్రొడక్షన్ డిజైనింగ్: ఎస్.రవీందర్
సమర్పణ: అల్లు అరవింద్
సంస్థ: జీఏ 2 పిక్చర్స్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
—ఇంట్రో—
నేడు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబ కథా చిత్రాలని లైక్ చేస్తున్నారు.. అందుకే దర్శకులు కూడా ఆ కాన్సెప్ట్ నే ఎంచుకుంటున్నా.. లవ్ ఓరియెండెట్ తో పాటు కుటుంబం విలువలు సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, భలే భలే మగాడివోయ్ నుంచి అదే దారిలోనే ఉన్నారు దర్శకుడు మారుతి. ఆయన గత చిత్రం శైలజారెడ్డి అల్లుడు ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది.. కాని అంత హిట్ కాలేదు
తాజాగా ప్రతీరోజూ పండగే చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి తో ఫామ్‌లోకి వచ్చిన సాయి తేజ్‌కి భిన్నమైన కథే ఇది మరి ఆ చిత్ర యూనిట్ ఎలాంటి పండుగ చేసిందో చూసొద్దాం.
—కథ—
రఘురామయ్య (సత్యరాజ్)కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోతారు. తాను మాత్రం ఒంటరిగా రాజమహేంద్రవరంలో గడుపుతుంటాడు. అనారోగ్యానికి గురైన రఘురామయ్యకి లంగ్ క్యాన్సర్ అని తేలుతుంది. ఐదు వారాల్లో ఆయన మరణిస్తాడని వైద్యులు చెబుతారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న పిల్లలు తాము రెండు వారాల తర్వాత వస్తామని చెబుతారు. కానీ, పెద్ద మనవడైన సాయి (సాయితేజ్) మాత్రం విషయం తెలియగానే తాత దగ్గర వాలిపోతాడు. మేం ఇప్పుడే రామని చెప్పిన మిగతా కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి రాజమహేంద్రవరానికి వచ్చేలా చేస్తాడు. తన తాతయ్య చివరి క్షణాల్లో సంతోషంగా కుటుంబ సభ్యులందరి మధ్య గడపాలని… ఆయన కోరికల్నీ, చేయాలనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయించాలని సాయి నిర్ణయిస్తాడు. మరి కుటుంబ సభ్యులు అందుకు సహకరించారా లేదా? తన తాతయ్య కోసం మనవడు ఏం చేశాడు? ఇవన్నీ చూడాలి అంటే థియేటర్ కు రావాల్సిందే
—విశ్లేషణ—
చివరి రోజుల్లో ఆనందం గురించి అద్బుతంగా తీశారు, చావు అని తెలిస్తే కుటుంబం ఎలా మారుతుంది ఇలా అనేక ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిగొలిపేలా ఉంది చిత్రం. వాస్తవంగా సెంటిమెంట్ సన్నివేశాలు వరుసకడతాయి. దర్శకుడు కథని కొత్తగా ఆలోచించి చావు అంశాన్ని కూడా కామెడీతో ముడిపెట్టి తీశాడు. అదే ఈ సినిమాని ప్రత్యేకంగా మార్చింది. నాటి సినిమా కథలు కూడా చాలా ఇలానే వచ్చాయి కాని కాన్సెప్ట మాత్రం దర్శకుడు వేరుగా తీసుకున్నారు..కుటుంబంలో అందరూ ఒకేలా ఉండరు కదా సో సంస్కారం విలువులు లేని పాత్రల్ని ఇందులో పె్టి వారితో కామెడీ చేసి మార్పు తెచ్చేలా సినిమా చేశారు అనే చెప్పాలి..ముఖ్యంగా రావు రమేష్ పాత్ర సాగే విధానం సినిమాకి ప్రధానబలం.
ఆయన ఇండియాలో అడుగు పెట్టడం నుంచే నవ్వులు మొదలవుతాయి. క్లారిటీ కావాలనే మనస్తత్వం, ఏదున్నా మొహంమీదే చెప్పేయడం వంటి లక్షణాలతో కూడిన ఆ పాత్ర నడుచుకునే విధానం కామెడీని పండిస్తుంది.టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణగా రాశీఖన్నా, హాస్యనటులు సుహాస్, మహేష్ తదితరులు పంచే కామెడీతో ఫస్టాఫ్ అదిరింది. కథని చాలా సింపుల్ గా ముగించేశారు అనే అనుకుంటా రు ప్రేక్షకులు.
సాయి తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నారై మనవడిగా, తాతని ప్రేమించే కుర్రాడిగా ఆయన పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. అయితే రావు రమేష్, సత్యరాజ్ పాత్రలతో పోలిస్తే సాయితేజ్ పాత్ర తేలిపోతుంది. తాతగా సత్యరాజ్ చక్కటి అభినయం ప్రదర్శించారు. ఇక రావు రమేష్ అయితే కడుపుబ్బా నవ్వించాడు. రాశీఖన్నా టిక్ టాక్ సెలబ్రిటీగా అందంగా కనిపించింది. ఇక మిగిలిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ అంశాలు అన్నీ బాగున్నాయి.
—బలాలు—
హాస్యం
కథనం
రావు రమేష్, సత్యరాజ్ పాత్రలు
సందేశం
నిర్మాణ విలువలు
—బలహీనతలు—
ముగింపు పై ఫోకస్ ఇంకా చేయాల్సింది
—బాటమ్ లైన్ —
ప్రతీ రోజూ పండుగలా అన్నీ కుటుంబాలు మారాలి అనేది కాన్సెప్ట్
రేటింగ్ 2.75