
హాస్పిటల్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు..
Krishnam Raju : కేంద్ర మాజీ మంత్రి .. రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చేరారు.
Krishnam Raju : కేంద్ర మాజీ మంత్రి .. (Rebel Star Krishnam Raju) హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చేరారు. నిన్న సాయంత్రం ఆయన తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ని వెంటనే అపోలో (Apollo) హాస్పిటల్‌లో జాయిన్ చేసారు. డాక్టర్లు ఆయన తుంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెబుతున్నారు. ఆయితే కృష్ణంరాజు రొటిన్ చెకప్ కోసమే అపోలో హాస్పిటల్‌కు వెళ్లారని ఆయన కార్యాలయ వర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికే ఆయన అపోలో హాస్పిటల్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు.
ఈ సందర్భంగా (Sai Dharam Tej) తొందర్లనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు కృష్ణంరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ఈయన త్వరలో ఇంగ్లాండ్‌కు కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రొటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్‌కి వెళ్లినట్టు సమాచారం.
కృష్ణంరాజు విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇపుడు తన తమ్ముడు తనయుడు PRABHAS హీరోగా నటిస్తోన్నRADHE SHYAM లో ఓ ముఖ్యపాత్రను చేస్తున్నట్టు సమాచారం. దాంతో పాటు ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.
ఇక కృష్ణంరాజు 1990లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.అంతేకాదు 1999-2004 మధ్యలో కేంద్ర సహాయ మంత్రిగా వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో పనిచేసారు. ఆ తర్వాత ఈయన చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరుపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ఈయన బీజేపీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విషయానికొస్తే.. ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను, అభిమానులను సంపాదించుకున్సారు. సీనియర్ హీరోలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ఉన్న కృష్ణంరాజు.. తన కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టి.. ఆ తర్వాత విలన్‌గా మారి.. ఆపై రెబల్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్