నవరస నటనా రాజకీయ సార్వభౌములారా! ఇక చాలించండయ్యా! ప్రజల గురించి ఆలోచించండయ్యా!!

Political sovereignty That's it

నన్ను పొడిచారు అని “YCP”, కాదు పొడుచుకొన్నాడు అని “టీడీపీ” చేస్తున్న లొల్లి, తొల్లి రక్తి కట్టినా, క్రమేపీ ఈ వీరి నాటకాలు ప్రజలకు అర్ధం అవుతుండడంతో, టీడీపీ, వైసీపీలకు బొడిపి కడుతున్నది. మూలుగుతున్న కరెన్సీ కట్టలతో కొని తెచ్చికొన్న నటనా చాతుర్యాన్ని అంతా ఉపయోగించి, ఒకరిమీద ఒకరు పై చేయి సాధించడానికి వీరిద్దరూ పోట్లాటను నటిస్తుంటే, పిచ్చి ప్రజలు చేసేదిలేక నిట్టూరుస్తూ చూడలేక చస్తున్నారు.

ప్రవృత్తి రీత్యా “నటులైన” మన నాయకులిద్దరు, డబ్బులు వెదజల్లి కొని తెచ్చికొన్న నటనతో రాజకీయాల్లో జీవిస్తున్నారు. వృత్తిరీత్యా నటుడైన పవన్ కళ్యాణ్ మాత్రం, తన నటనకు స్వస్తి చెప్పి మోసపోతున్న ఈ ప్రజలను మార్చాలని ప్రజలవెంట తిరుగుతున్నాడు.

పాలకులైన జగన్ బాబుకి, చంద్రబాబుకి అన్యాయం జరుగుతున్నదని కన్నీరు కారుస్తున్న, ఓ బానిసల్లారా కాస్త కళ్ళు తెరవండయ్యా!

మొన్న దళిత స్త్రీని వివస్త్రని చేసినప్పుడు గాని, లేదా పదిరికుప్పం, చుండూరు, కంచికచర్ల, కారంచేడుల్లో ఊచకోతకు గురైన దళిత సోదరుల జ్ఞాపకార్థముగాగాని ఎప్పుడైనా మన పాలకులు ఇంత చర్చ, రాద్దాంతం చేశారా?

ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వాలపై, ఉద్యమాలు చేసినప్పుడు అణచివేతలకు గురియైన మంద కృష్ణ మాదిగ, ముద్రగడ, మరియు ఇతర గిరిజన, మత్సకార సోదరుల గురించి నేటి అధికార, ప్రతిపక్షాలు ఇంత రాద్దాంతం, చర్చ ఎప్పుడైనా చేశాయా?

పాలకుల అధికార దాహానికి బలైపోతున్న సామాన్యుల గురించిగాని, ఇసుక రాంపుల్లో, మట్టి పెళ్ళల్లో, అధికార పార్టీ నాయకుల ఇళ్ల గుమ్మాల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల్లో, వేచి, వేచి మాడి మసై పోతున్న బడుగు జీవుల గురించి ఎప్పుడైనా ఈ పార్టీలు చర్చలు చేశాయా? రాద్దంతాలు చేశాయా?

ఒక పక్కన విధినిర్వహణ, మరొక పక్కన ప్రభుత్వ వెట్టిచాకిరీ చేయలేక, ఎదురు చెప్పలేక మగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎప్పుడైనా నేటి కమ్మని దొడ్డ దొరల పార్టీలు రాద్దంతాలు చేశాయా?

బంగారు బాతులాంటి నటనను వదిలి, సంపాదించిన దానిని ప్రజలకు పంచిపెడుతూ, మార్పు తేవాలి అంటూ ప్రజల వెంట తిరుగుతున్న పవన్ కళ్యాణ్’ని ఒక్కసారైనా నేటి కమ్మని దొడ్డ దొరలు మెచ్చుకొన్నారా? ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ సతులను, సుతులను, తల్లిని వీధికి ఈడిస్తూ, పవన్ కళ్యాణ్ శీలాన్ని తమ తమ మీడియా సాక్షిగా అపహరణ చేస్తుంటే, వీరిద్దరూ ఎప్పుడైనా ఖండించారా?

పవన్ కళ్యాణ్ మీద దాడులు చేసినప్పుడుగాని, పోలీస్ స్టేషనులో పిర్యాదు చేసినా చర్యలు తీసికోని ప్రభుత్వపైగాని నేటి ” అధికార, ప్రతిపక్షాలు” ఎప్పుడైనా స్పందించి, చర్చలు పెట్టి రాద్దాంతం చేశాయా?

లేదే! చేయలేదే.!!! చేసిన తప్పులను సమర్ధించుకొంటూ ప్రభుత్వము, నాకు అధికారం వచ్చిన తరువాతే అన్నీ అంటూ ప్రతిపక్షము పురాణ కాలక్షేపం చేశాయి. మరి దేనికోసం వీరు చేస్తున్న నేటి రాద్దాంతాలు? ఎవరికోసం. ప్రజలకోసమా? కాదు. కాదు. మరి దేనికోసం?

వీరి ఇద్దరిలో ఒకరిని శాశ్వతముగా అడ్డు తోలగించుకోవాలనా? ఎన్నటికీ కాదు. వీరు వీరు తమ నటనా కౌశల్యాన్నిప్రదర్చించి, ప్రజలని పిచ్చివాళ్ళని చేసి, అడ్డుగా వస్తూన్న “లేగ దూడ”లాంటి జనసేనుడిని అడ్డు తొలగించు కోవడానికే? మార్పుకి అడ్డుగా, కొత్త పార్టీలకు వ్యతిరేకముగా పాలకులిద్దరూ ఆడుతున్న చంద్ర హాసాలతో కూడిన జగన్నాటకాలే అనేది గమనించాలి. ప్రజలు తిరగబడనంతవరకు, వీరి డ్రామాలు ఆగవేమో?

ఆలోచిద్దాం… మన తలరాతల్లో మార్పు కోసం… నిజాయితీని నిలబెడదాం

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.