ప్లీజ్ ఆపరేషన్ వద్దు పవన్ కల్యాణ్ ఎందుకంటే

Please do not want the operation because Pawan Kalyan

రాజకీయాల్లో జనసేనాని బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి వచ్చినా ఆయన వెనుదిరగలేదు, జనసేన పార్టీ తరపున ముందుకు వెళుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తాజాగా జనసేన పార్టీ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. కొద్ది రోజులుగా జనసేన సీనియర్ అఫీషియల్స్ కు మాత్రమే ఈ విషయం తెలుసు, కాని తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ లేఖతో తేలిపోయింది.

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటినుంచి వెన్నునొప్పి బాధిస్తోందట.. అసెంబ్లీ ఎన్నికల్లో అది పెరగగా ఫారిన్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే ఆ సమస్యను అశ్రద్ధ చేయడంతో తాజాగా మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. పవన్ పెద్దగా ప్రచారం చేయద్దు అని చెప్పినా చేశారు, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోకుండా బాగా స్ట్రెస్ పెంచుకున్నారట. సో అది మళ్లీ తిరగపెట్టింది అని తెలుస్తోంది.

ఇక మళ్లీ అది పెయిన్ గా పెరగడంతో పవన్ మంచం పై ఎక్కువ సేపు రెస్ట్ తీసుకుంటున్నారు.. ఇక్కడ స్పెషలిస్టుల చేత చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆపరేషన్ అవసరం అని డాక్టర్లు చెబితే సున్నితంగా పవన్ తిరస్కరించారు. అయితే పవన్ కు ఆనొప్పి తగ్గుతుంది అని నమ్మకం ఉందట. దాని కోసం ఆయన ప్రకృతి చికిత్స తీసుకుంటారట, అలా కంట్రోల్ చేస్తానని తెలిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ మాత్రం ప్రకృతి వైద్యంతో శస్త్రచికిత్స లేకుండానే దాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. సో ఈ నిర్ణయం పై జనసేన వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి, కొద్ది రోజులు పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉండనున్నారు పవన్ కల్యాణ్.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.