జనసేన తొలిగెలుపు ఈ సెగ్మెంట్ నుంచే

Pithani balakrishna win janasena first consequences

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన తన దూకుడు చూపిస్తోంది… ముఖ్యంగా ఇక్కడ గన్నవరం ముమ్మిడివరం కాకినాడ తుని పిఠాపురం సెగ్మెంట్లలో జనసేన దూసుకుపోతోంది.. బహుశా పవన్ అనంతపురం కాదు అనుకుంటే ఇక్కడ జిల్లా నుంచి ఎక్కడ సెగ్మెంట్ లో అయినా పోటీ చేయవచ్చు, తాజాగా జనసేన తొలి అభ్యర్దిగా ప్రకటింపబడ్డ ఆ పార్టీ నాయకుడు పితాని బాలకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానంలో మంచి గ్రాఫ్ తో ఉన్నారట.. ఇటు వైసీపీ తెలుగుదేశం పార్టీకంటే పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ పెరిగింది అని తెలుస్తోంది.

జనసేన తరుపున శాసనసభ సభ్యుడిగా పోటీచేసే అవకాశాన్ని పొందిన తొలి నేతగా పితాని బాలకృష్ణను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు జిల్లాలనే కాదు స్టేట్ లో ఓ రికార్డు సృష్టించాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ వైసిపి నుంచి జనసేన లో చేరిన ఆయనకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైసీపీ కేడర్ కూడా ఆయనపై నమ్మకంతో జనసేనలో చేరారు. ఇక ఆయన కు జిల్లాలో కనివినీ ఎరుగని మెజార్టీ వస్తుంది అని చెబుతున్నారు నాయకులు.

ఇక జనసేనలో చేరిన నాయకులు అందరూ కూడా ఇలా పితాని కచ్చితంగా గెలుస్తారు అని వైసీపీలో ఆయనకు టికెట్ కూడా ఇవ్వరు అని, అయితే ఆయనలాంటి సీనియర్ ముమ్మిడివరంలో అవసరం అని చెబుతున్నారు జనసైనికులు, ఇక జనసేన తన గుర్తుతో ముమ్మిడివరంలో ప్రచారం బాగా చేస్తోంది.. ముఖ్యంగా యువత పవన్ అభిమానులు పెద్ద ఎత్తున జనసేనకు సపోర్ట్ గా ఉన్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.