
పేట రివ్యూ జానర్
యాక్షన్ డ్రామా
తారాగణం : రజనీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాత : అశోక్ వల్లభనేని, కళానిథి మారన్
!!ఇంట్రో !!
ఇటీవల వచ్చిన రోబో 2.0 చిత్రం తర్వాత వెంటనే సందడి చేయడానికి పేటతో వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్.. మాస్ లో ఆయనకు ఉన్న క్రేజ్ మాములుది కాదు అని చెప్పాలి… సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పేట. కోలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తెలుగులో మాత్రం ఎన్నో వివాదాల మధ్య అతి కష్టం మీద రిలీజ్ అయ్యింది..ధియేటర్స్ దక్కవు అని అనుకున్నారు కాని వివాదాల సమయంలో, ఇలా రిలీజ్ అవడం పై రజనీ అభిమానులు హ్యాపీగా ఉన్నారు..మరి ఈ సినిమా ఎలా ఉందోచూద్దాం
!!కథ!!
కాళీ (రజనీకాంత్) ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్ హీలర్గా పనిచేసే డాక్టర్(సిమ్రన్)తో కాళీకి పరిచయం అవుతుంది. అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? పేట తిరిగి ఉత్తరప్రదేశ్ వెళ్లాడా.. లేదా..? అన్నదే మిగతా కథ.ఇది వెండితెరపై చూడాలి
!!విశ్లేషణ!!
రజనీకాంత్ మరోసారి మాస్ స్టేచర్ చూపించారు అని చెప్పాలి.. మాస్ లో ఉన్న క్లాస్ లుక్స్ ఎవరికి అయినా ఇట్టే సూట్ అవుతాయి అంటే అది రజనీకి అనేచెప్పాలి ..ఇక తన మాస్ యాక్షన్ తో సినిమాని క్లాస్ గా చూపించారు .. ఇక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. ప్రతినాయక పాత్రలను కూడా అంత బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్ సేతుపతి, నవాజుద్ధిన్ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలు గుర్తుండిపోయేలా లేవు.ఇక సినిమా అంతా రజనీ మేనియా వన్ మ్యాన్ షో అని చెప్పాలి…పేట పక్కా కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కిన సినిమా హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం.
ఓ భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ లో చాలా సినిమాలు వచ్చాయి. రజనీ కూడా గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. అయితే మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.కొత్త కథ కాకపోయినా సినిమాలో రజనీ నటన ఆకట్టుకుంది మరోసారి భాషా కనిపించినట్టు ఉంది అనే పేరు ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి మాస్ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది అని చెప్పాలి… మొత్తానికి పేట సినిమా ఆకట్టుకుంది రజీనా అభిమానులకే కదు సగటు తెలుగు ప్రేక్షకుడిని కూడా
!!ప్లస్ పాయింట్స్!!
కథ
దర్శకత్వం
రజనీకాంత్
నేపథ్య సంగీతం
కొన్ని ట్విస్ట్‌లు
సంగీతం
!!మైనస్ పాయింట్స్!!
రొటీన్ కథ
సెకండ్ హాఫ్
రేటింగ్ 3