బాబు విష‌యంలో సీరియ‌స్ గా ఉన్న ప‌వ‌న్ ప్రెస్ మీట్ కు రెడీ

Pawan's press meet will be very serious in the case of Chandra Babu

రాజ‌కీయాల్లో ఫేమ్ ని ఉప‌యోగించుకోవ‌డంలో బాబుని మించిన వాడు లేడు అనే చెప్పాలి. 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్,2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కల్యాణ్ ఇలా బాబు వాడ‌కంలో ఆయ‌న్ని మించిన వాడు లేడు అనే చెప్పాలి.. ఇక కూట‌మి స‌భ్యుల గురించి ఆయ‌న ఆలోచ‌న అలాగే ఉంది. తాజాగా మ‌రోసారి టంగ్ స్లిప్ అయ్యి సోష‌ల్ మీడియాలో మ‌రో స్టార్ అయ్యారు చంద్ర‌బాబు.

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గూటి పక్షేనని మరోసారి స్పష్టమైంది అంటూ తెలుగుదేశం మీడియా వైసీపీ మీడియా ప‌వ‌న్ పై అభాండాలు వేస్తున్నారు. ఖమ్మం పట్టణంలో బుధవారం మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు య‌ధావిధిగా త‌న టంగ్ స్లిప్ అయ్యారు. అయితే దీనిని కూడా జ‌న‌సేన‌పై బుర‌ద చ‌ల్లే ప‌నిగా వైసీపీ టీడీపీ చేస్తున్నాయి.

ఈ సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఓ సైనికుడిగా తయారు కావాలి. పోలింగ్‌కు ఇంకా ఐదు రోజులే ఉంది.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ, జనసేన.. తెలంగాణ జనసేన, సీపీఐ, అందరు కార్యకర్తలు కలవాలి. ఇది మీ బాధ్యత ఎవరూ చెప్పక్కర్లేదు. అందరూ కలిసి ఒకే తాటిపై నిలిచి గెలిపించుకుందామని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాఅని మాట్లాడారు అయితే ఇక్క‌డ పాయింట్ బాగానే ఉన్నా ఈ కూట‌మిలో చంద్ర‌బాబు
జ‌న‌సేన‌ని చేర్చారు… గ‌త ఎన్నిక‌ల్లో మ‌న‌వాడే క‌దా అని గుర్తు ఉంచుకుని, ఈ ప్రచారంలో కూడా ప‌వ‌న్ పేరు ఎత్తారు.

కాని ప‌వ‌న్ టీడీపీకి గుడ్ బై చెప్పి చాలా నెల‌లు అయింది. చంద్ర‌బాబు ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే పెద్ద ఎత్తున హ‌ర్షం వ‌చ్చింది. త‌న త‌ప్పు తెలుసుకున్నా దానిని క‌వ‌ర్ చేయ‌లేదు బాబు. ఇక ఆయ‌న పార్టీ ఏ పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది అనేది కూడా తెలియ‌కుండా బాబు తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తున్నారు అనేది, అంద‌రికి అర్ధం అయింది. ఇప్పుడు ఇదే విష‌యంలో అక్క‌డ సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మొద‌లు అయ్యాయి…దీనిపై ప‌వ‌న్ సీరియ‌స్ గా ఉన్నార‌ట. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం నేత‌ల‌కు సీఎం చంద్ర‌బాబుకు కౌంట‌ర్ఇస్తారు అని తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.