
సంక్రాంతికి పవన్ సరికొత్త నిర్ణయం
జనసేన జన తరంగాలు స్పీడుగా ఏపీలో వీస్తున్నాయి అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ప్రతీ సమస్యపైనా వారు పోరాడుతున్నారు.. పవన్ తన పోరాట పటిమని, ప్రజల వెన్నంటి ఉండి ముందుకు తీసుకువెళుతున్నారు.. ఇక మరో 20 రోజుల్లో సంక్రాంతి ఉండబోతోంది.. దీంతో ఏపీలో ప్రజలు అందరూ కూడా సంక్రాంతికి, ఈ ఏడాది ఎన్నికలకు ముందు జరుగుతున్న పండుగగా చూస్తున్నారు.. వచ్చే ఏడాది ఈ ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది తేలనుంది.
అయితే జనసేన కూడా తన జోరు చూపిస్తోంది. జనసేనకు ఎన్నికల క్రాంతి సమయం ఆరంభం కానుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుంది.
అని అన్నారు అయితే వచ్చే ఏడాది నుంచి తన రాజకీయం సరికొత్తగా ఉండనుంది అని చెప్పారు పవన్ . అందుకే జనవరి 1 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తారట పవన్ కల్యాణ్ .. ఆయన అమరావతి- విజయవాడ ఈ రెండు ప్రాంతాల్లో నాయకులకు అందుబాటులో ఉండనున్నారు అని తెలుస్తోంది.
జనసైనికుల కవాతు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్లు తొక్కుతోంది. రండి.. గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం.. నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం. కలసి కొత్త శకాన్ని సృష్టిద్దాం అని ట్విటర్‌లో పిలుపిచ్చారు పవన్ మొత్తానికి పవన్ దూకుడు చూస్తుంటే పార్టీ పటిష్టంగా ఎన్నికలకు రెడీ అయింది అనే చెప్పాలి. ఇటీవల గుంటూరుజిల్లా నుంచి రావెల చేరడంతో జిల్లా రాజకీయాలు కూడా ఆయనకే అప్పగించారు జనసేనాని.. ఇక పార్టీలో చేరే నాయకులు అలాగే పార్టీ పటిష్టత కోసం జిల్లా నుంచి ఏమి చేయాలి అని వారి నుంచి తగు సలహాలు తీసుకుంటున్నారు పవన్.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్