బాబుకు కౌంటర్ ఇచ్చేందుకు పవన్ రెడీ

Pawan will be ready to give by a counter to chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఇప్పుడు హీట్ పుట్టించారు.. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అయిన బాబు ఇప్పుడు మరోసారి పవన్ ని బద్నాం చేసే ఎత్తుగడలు వేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పేంటని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు.. ఓసారి పవన్ మీతో కలసినందుకు ఇప్పుడుఎంతో విచారిస్తున్నారు, మరోసారి కలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటో, ప్రజలకు తెలుసు అని ఇలాంటి రాజకీయాలు బాబు మాత్రమే చేస్తారు అని విమర్శిస్తున్నారు.

అయితే ఈ విషయంలో మాత్రం సరైన సమయంలోనే పవన్ స్పందిస్తారని చెబుతున్నారు జనసేన నాయకులు.. అయితే చంద్రబాబు వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో మాత్రం జనసేన నాయకులు లేరు అనేది తెలుస్తోంది. ఇలా ఎన్నికల సమయంలో కాపులు ఓటు బ్యాంకు అలాగే పవన్ ఫ్యాన్స్ ని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ఎత్తులు గా కూడా భావిస్తున్నారు కొందరు.

పవన్కళ్యాణ్ను జగన్ నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం తప్పా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్కు ఎందుకు నొప్పి? అంటూ వ్యాఖ్యానించారు.. చంద్రబాబు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్ ఆ తర్వాత మారిన పరిస్థితులతో చంద్రబాబు, లోకేష్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైసీపీని తెలుగుదేశం పార్టీని నిత్య విమర్శలతో బద్నాం చేస్తున్న పవన్ పై ఇలా మరో వక్ర వ్యాఖ్యలు చేసి ప్రజల్లో బాబు తగ్గాంచాలి అని చూస్తున్నారు అని, ఇటువంటి రాజకీయం కుదరదు అని విమర్శించారు జనసేన నాయకులు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కచ్చితంగా జనసేన సింగిల్ గా పోటీ చేస్తుంది అని, ఇందులో ఏమాత్రం మీమాంసలేదు అని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇక పవన్ బాబుకు కౌంటర్ ఇవ్వనున్నారట త్వరలో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.