ఈ సెగ్మెంట్లో పవన్ కు తిరుగేలేదు

Pawan was not in this segment

వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీలు నువ్వా నేనా అనేలా తలపడుతున్నాయి.. ఇక టిక్కెట్ల విషయంలో ఎవరికి టికెట్ వస్తుంది ఎవరికి మొండి చేయి వస్తుంది అని లేదు, ఇటు వైసీపీ కాకపోతే జనసేన, లేకపోతే టీడీపీ అనేలా కొందరు సీనియర్లు కర్చీఫ్ వేసుకున్నారు.. అయితే ఇలా అందరూ ఏమో కాని, పవన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్నారు.. ఇప్పుడు పార్టీలో హాడావిడిగా చేరే వారికి వెంటనే పార్టీలో సీటు ఇచ్చే పద్దతికి స్వస్తిపలికారట.. పార్టీలో ఏనాటి నుంచో ఉన్నవారికి టికెట్ ఇవ్వనున్నారు పవన్..

అయితే పవన్ ఆలోచన బాగుంది.. ఏ సమయానికి అనుకూలం అయితే ఆ గూడు కింద ఉండే నాయకులు ఎందరు ఉన్నా పార్టీకి వారు ఉపయోగం ఉండరు అనదే పవన్ గుర్తించారు…ఇక్కడ జనసేన పిఠాపురం నియోజకవర్గం పై మంచి టార్గెట్ పెట్టింది అని చెప్పాలి. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఇక ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతున్న ఈ సెగ్మెంట్లో జనసేనుడికి ఆపార్టీకి తిరుగులేదు అని చెబుతున్నారు ఇక్కడ కేడర్.

ఎందుకు అంటే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీలకు ధీటుగా నాయకులు జనసేన నుంచి కేడర్ ఉన్నారు.. ఇక ఇక్కడ మరో మాస్టర్ స్ట్రోక్ ఏమిటి అంటే, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారో ఆ పార్టీ వారే రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారు. సో అందుకే గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు ఇదే ఫార్మూలా పాటిస్తున్నారు.

ఇక గతంలో ఆ దేవుని ఆశీస్సులు ఉంటే తాను కూడా పిఠాపురం నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు.మరి ఇక్కడ పవన్ పోటీ చేస్తే కచ్చితంగా గెలుపు షురు అనే చెప్పాలి.. ఇక ప్రజారాజ్యం పార్టీ తరపున గతంలో పోటీచేసి గెలిచిన వంగ గీత ఈసారి జనసేనలో చేరి టికెట్ సంపాదిస్తారు అని అంటున్నారు కొందరు. మొత్తానికి ఏది ఏమైనా పార్టీ తరపున ఇక్కడ గెలుపు మాత్రం ఎవరు అయినా పక్కా అని, జనసేన జెండా ఎగురవేస్తారు అని అంటున్నారు జనసేన కేడర్.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.