నవంబర్ 2న పవన్ రైలు యాత్ర జనసేనకు కొత్త జోష్

Pawan Kalyan train journey new Josh for Janasena

పవన్ కల్యాణ్ పొలిటికల్ గా మరింత దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన జనం బాట పట్టారు.. నవంబర్ 2న ఆయన జనంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 2న జనంతో కలిసి రైలు ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. శుక్రవారం (నవంబర్ 2న) విజయవాడ నుంచి తుని వరకు ట్రైన్ జర్నీ చేయనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ పర్యటన వివరాలను జనసేన పార్టీ విడుదల చేసింది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మభూమి ఎక్స్ప్రెస్లో పవన్ బయల్దేరతారు. రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు తుని చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే.. జనసేన పార్టీ ఆశయాలకు పవన్ వివరించనున్నారు. అయితే పవన్ ఈ నిర్ణయం చాలా వినూత్నంగా తీసుకున్నారు…మరోవైపు జనసేనాని అధికారికంగా ఫేస్బుక్ పేజీని మంగళవారం ప్రారంభించారు.

ఆ పేజీలో తొలి పోస్టుగా తుని రైలు ప్రయాణ వివరాలను విడుదల చేశారు.. తన పర్యటన వివరాలు, పార్టీ సిద్ధాంతాలను నెటిజన్లకు వివరించేందుకు ఈ పేజీని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు.. దీంతో సోషల్ మీడియాలో పవన్ మరింత యాక్టీవ్ గా ఉంటున్నారు అనేది తేటతెల్లమైంది. ఇక పవన్ కు పెద్ద ఎత్తున ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.. ఇక ఈ రైలు ప్రయాణం తర్వాత ఆయన పొలిటికల్ యాక్షన్ ప్లాన్ యధావిధిగా సాధారణంగా జరుగుతుంది అని చెబుతున్నారు. అలాగే పవన్ రాజకీయంగా జనసేన పోరాట యాత్రతో నవంబర్ మూడున తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. నవంబర్ 4నవంతాడ, జగ్గంపేటలలో పర్యటిస్తారు. 5, 6, 7న కాకినాడలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తదుపరి షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. దీంతో పవన్ అభిమానులు మరింత జోష్ లో ఉన్నారు, ఈ రైలు యాత్రలో పాల్లొంటాము అని చెబుతున్నారు పవన్- జనసేన అభిమానులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.