ధవళేశ్వరం కవాతు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం

• తూర్పు గోదావరిలో ఇంత ప్రేమ ఉంటుందని కలలో కూడా ఊహించలేదు
• ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి కవాతుకు వచ్చిన అందరికీ నమస్కారాలు.
• తల్లి గోదావరి ప్రవాహంలో జాలువారే తెల్లని ముత్యాలు తెలుగింటి ఆడచపడుచులు
• మదమెక్కిన మహిషాల్లాంటి మానవ పోతులను తెగనరికే ఖడ్గాలు
• మానవ మృగాలను ఛిద్రం చేసే, ఛేదించే పార్వతి దేవి త్రిశూలాలు ఆడపడుచులు
• కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు జనసైనికులు
• దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమసింహాలు జనసైనికులు
• తల్లి భరతమాతకు ముద్దు బిడ్డలు జనసైనికులు
• రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయింది
• నిరుద్యోగ సమస్యతో యువకులు రగిలిపోతున్నారు
• కారుమబ్బు్లో పరుగెత్తే పిడుగులు…జన సైనికులు
• దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు… జన సైనికులు
• మిలిటరీ సైనికులే తప్ప సామాన్యులు కవాతు చేయరు.
• అవినీతిని ప్రక్షాళన చేయడమే కవాతు ముఖ్య ఉద్ధేశం
• దోపిడీ వ్యవస్థను అంతమొందించడమే కవాతు ఉద్ధేశం
• 2 కోట్ల మందికి ఉద్యోగాలు అని చెప్పారు
• జనసేన పార్టీ బాధ్యతతో, క్రమశిక్షణతో నడిచే పార్టీ
• నేను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటా
• రాజకీయ వ్యవస్థను నడిపే వ్యక్తులే కుళ్లు కుతంత్రాలు చేస్తున్నారు.
• ఈ బలం, బలగం మనకు 2009లో లేదా..?
• రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని నమ్మే వ్యక్తిని నేను
• నేను పార్టీ పెట్టింది స్వప్రయోజనాల కోసం కాదు.. రాష్ట్రప్రయోజనాల కోసమే
• రాష్ట్ర శ్రేయస్సు కోసం 2009లో పోటీ చేయకుండా చంద్రబాబుకి మద్దతిచ్చా
• సినిమాలను వదిలేసి, ఏమీ ఆశించకుండా రాష్ట్రం కోసం వచ్చా
• పదవులు ఆశించకుండా టీడీపీకి మద్దతిచ్చా
• చాలా మంది నా భావజాలాన్ని ఇష్టపడి జనసైనికులుగా మారుతున్నారు.
• జనసేన భావజాలం ప్రజల్లోకి వెళ్లకూడదనేది టీడీపీ ఉద్దేశం
• నిరుద్యోగ సమస్యతో యువకులు రగిలిపోతున్నారు
• బాధ్యతగా ఉన్న నన్ను ఏ రోజు కూడా ప్రత్యేక హోదా అంశంలో నా సలహా అడగలేదు
• ఉత్తరాంధ్ర నుంచి ఏ మూలకు వెళ్లినా సమస్యలే
• మౌలిక వసతులుండవు, రోడ్లు ఉండవు.. కానీ విజన్ 20-20 అంటారు.
• సీఎం విజన్ 20-20లో 2 కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది.
• జీలకర్రలో కర్రా లేదు, నేతిబీర నెయ్యిలేదు.. బాబు జాబులో జాబు లేదు
• దేశ విదేశాలు తిరుగుతున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
• ఒకప్పుడు గోదావరి అందాలు కనిపించేవి.. ఇప్పుడు ఇసుక దోపిడీలే
• అవి జన్మభూమి కమిటీలా.. దోపిడీ కమిటీలా..?
• బాబు మళ్లీ వచ్చి ఏం చేస్తారు?
• ఏమీ ఆశించకుండా మద్దతిస్తే బూతులు తిట్టించారు
• సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కి నా సవాల్…
• నేను రాజకీయాలను అర్ధం చేసుకుని వచ్చాను.
• మాట్లాడితే పవన్ సినిమా యాక్టర్ అంటారు.
• లోకేశ్ కి ఏం తెలుసు.. పంచాయతీ సర్పంచ్ గా కూడా లోకేశ్ గెలవలేడు.
• ఏం తెలుసని లోకేష్ ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు.
• విదేశాలకు వెళ్లి బిల్ గేట్స్ ని కలవడం కాదు సగటు మనిషిని కలిసి కష్టాలు తెలుసుకోండి.
• జనసేన అధికారంలోకి వస్తే అసంఘటిత కార్మికులకు అండగా ఉంటాం.
• నాకు ముఖ్యమంత్రి పదవి అలంకారం కాదు
• వారసత్వ రాజకీయాలు నాకొద్దు
• ఒక పోస్ట్ మెన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు సీఎం ఎందుకు కాకూడదు.
• ఇది నాకు మూడో ఎలక్షన్.. దశాబ్దం అనుభవం చూశా.
• చెయ్యని తప్పులకు నెలల తరబడి అవమానాలు ఎదుర్కొన్నాం
• పౌరుషాలు మీకేనా.. మాకు రావా..
• జాతిని గౌరవించే వాళ్లం.. అవమానాలను భరిస్తాం, సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం.
• మా తాతలు వ్యాపారాలు చేసే వాళ్లు కాదు..
• బలమైన విలువలు ఇచ్చిన వ్యక్తి మా నాన్న.
• నేను వదిలేస్తే పోరాటం చేసే వాళ్లు ముందుకు రారని రాజకీయాల్లోకి వచ్చా
• ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత భద్రత కోరుకుంటారు
• ఉద్యోగ భద్రత కోసం పింఛను అందిస్తారు
• పింఛను సొమ్మును స్టాక్ మార్కెట్లలో పెట్టబడి పెడుతున్నారు
• జనసేన అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తాం
• సీపీఎస్ పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం
• ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడతాం.
• నేను తెలంగాణలో పుట్టలేదు కానీ నన్ను అక్కడి వారు అక్కున చేర్చుకున్నారు
• తూర్పు గోదావరిలోని మూలాలు, సంస్కృతిని అర్థం చేసుకుంటా..
• గోదావరిలోని అణువణువూ తిరుగుతా
• ప్రజల అండగా నిలబడితే అన్ని సీట్లు గెలిసి చూపిస్తాం.
• సరికొత్త రాజకీయ మార్పు రావాలంటే మూలాలు నుంచి రావాలి
• పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది
• పంచాయతీ ఎన్నికలు పెట్టండి మా సత్తా ఏంటో చూపిస్తాం
• పంచాయతీ ఎన్నికలు పెట్టినందు వల్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి
• పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టే హక్కు మీకు లేదు
• ముఖ్యమంత్రి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు.
• ఎన్నికలు పెట్టకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
• నిజంగా బీసీలు, ఎస్సీలపై ప్రేమ ఉంటే పంచాయతీ ఎన్నికలు పెట్టండి
• ముఖ్యమంత్రి పద్దతి మార్చుకోవాలి
• జగన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించలేదు కానీ.. జనసేన హుందాగా వ్యవహరించింది.
• దౌర్జన్యంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
• ఏ మూలకెళ్లినా జనసేనకు నాయకులు లేరని అడుగుతున్నారు
• జనసేన ఆలోచన విధానాన్ని చూసి పలువురు స్వచ్ఛందంగా వస్తున్నారు.
• అన్నా హజారే, కేజ్రీవాల్ లా విలువలు మాట్లాడలేను
• పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం.
• దండలు, అభిషేకాలు చేయడం కాదు నేతల ఆశయాలను నెరవేర్చాలి.
• జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్ కి ఉంది.
• ఫ్యాక్షన్ రాజకీయాలు గోదావరిలోకి తీసుకొస్తే తన్ని తరిమేసి.. గోదావరిలో కలిపేస్తా
• ప్రజాస్వామ్య బద్ధంగా యుద్దం చేస్తే మేమూ అలానే చేస్తాం
• ప్రాణం భయంలేని వాణ్ని.. బెదిరింపులకు భయపడేవాన్ని కాదు
• భగత్ సింగ్, ఆజాద్ లాంటి గొప్ప నాయకుల ఆశయాలను స్పూర్తిగా తీసుకుని వచ్చాను
• నాకు బలమైన పరిపాలన ఇవ్వండి అని నేను సీఎంని అడిగా
• చట్టాలను పరిరక్షించాల్సిన మీరే ఆడపడుచులను నడిరోడ్డుపై అవమానించారు
• ఇసుక దోపిడీలపై చంద్రబాబు నోరు విప్పరే
• దళిత తేజం అంటారు.. దళితుల పట్ల మీకు గౌరవం ఏది?

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.