ఉత్తరాంధ్రా పై పవన్ స్పెషన్ ఫోకస్

Pawan Kalyan special focus on Uttarandhra - Janasena

ఏపీలో కరెక్ట్ గా ఎన్నికలకు మరో వంద రోజులు మాత్రమే సమయం ఉంది.. దీంతో రాజకీయ పార్టీలు అన్ని పెద్ద ఎత్తున వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి.. తమకు ఎవరిపై నమ్మకం ఉందో వారికి గెలుపు గుర్రాలు అనుకునేవారికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు పార్టీ అధినేతలు.. అయితే పార్టీ తరపున సీనియర్లు జూనియర్లు కూడా ఇప్పటికే తమకు టికెట్ వస్తుందా లేదా అనేది కూడా తమ పార్టీ అధినేతలతో చర్చించి, ఒకవేళ టికెట్ రాకపోతే ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలి అని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాగే జనసేనలో చాలా మంది నాయకులు పవన్ పై నమ్మకంతో జనసేనలో చేరుతున్నారు.. ముఖ్యంగా ఏపీలో జనసేనపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్కల్యాన్ దృష్టి పెట్టారు… ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించిన జనసేనాని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు.. ఇంటింటికి జనసేన గుర్తుని జనసేన విధానాలను తెలియచేస్తున్నారు.. ప్రతీ సెగ్మెంట్లో జనసేన పార్టీ తరపున నాయకులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు.. ఇక పోరాట యాత్రలు కూడా చేశారు పవన్ కల్యాణ్. అలాగే బహిరంగ సభలు పెట్టి నాయకులను పార్టీ కేడర్ ని దగ్గరకు చేర్చారు…మరికొన్ని జిల్లాల నేతలతో అక్కడి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక తూర్పు -పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా పై కూడా ఆయన ఫోకస్ పెట్టారట.. అందుకే ఆయన తాజాగా విశాఖ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న పవన్ విశాఖ వెళ్తారని… అక్కడ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతారు అని తెలుస్తోంది.ఇక తర్వాత 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశమవుతారు ఇక్కడ పార్టీ పరిస్ధితి అలాగే అభ్యర్దుల గురించి చర్చ కూడా జరుగుతుందట.. అదే రోజు మధ్యాహ్నం పాడేరులో బహిరంగసభలో పాల్గొంటారు. 24వ తేదీన విజయనగరం జిల్లా నేతలతో, 25వ తేదీన విశాఖపట్నం జిల్లా నేతలతో పవన్ చర్చిస్తారని పార్టీ నేతలు చెప్పారు. ఇప్పటికే పవన్ టూర్ ఫిక్స్ అయింది అని అంటున్నారు నాయకులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.