
పవన్ సంచలన ట్వీట్
కొద్దిరోజులుగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఎవరివైపు మెగ్గుచూపుతుంది అనే ఆలోచన అందరిక కలిగింది.. అయితే పవన్ కల్యాణ్ పార్టీ తెలంగాణలో ఇప్పటికే 20 నుంచి 30 శాతం ఓట్లను ఆకర్షించలగలదు అనేది తేలింది పలు సర్వేలలో.. పైగా నైజాంలో ఆయనకు ఉన్న ఫాలొయింగ్ అంతా ఇంతా కాదు.. అందుకే ఆయన ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టులు కోదండరాం పార్టీ కలిపి ముందుకు కూటమిగా వచ్చాయి. ఇందులో కమ్యూనిస్టులు మినహా మిగిలిన వారితో పవన్ కు పడదు. అయితే ఇటు టీఆర్ఎస్ పాలనపై కూడా ఏనాడు ఈ నాలుగు సంవత్సరాలు పవన్ కామెంట్లు చేయలేదు.
అయితే తాజాగా మరో రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది.. తెలంగాణలో ఇక జనసేన ఈ సమయంలో ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎవరికి పవన్ సపోర్ట్ చేస్తారు? అనేది ఇప్పుడు పెద్ద చర్చకు తావిస్తోంది. ఎందుకు అంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీకి మద్దతు తెలుపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు కాబట్టి. ఇప్పటికే కేటీఆర్ పవన్ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారని చెబుతున్నారు అలాగే .. పవన్ కల్యాణ్ అభిమానుల మద్దతు కోరటానికి ప్రయత్నిస్తున్నారు.
అలాగే ఎక్కడా కూడా కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పవన్ విమర్శించలేదు. ఇక తాజాగా పవన్ తన అభిప్రాయాన్ని 5వ తేదీన ప్రకటిస్తానని, తెలంగాణ ఎన్నికల్లో తన సపోర్ట్ ఎవరికి అనేది ఆరోజు తెలియచేస్తాను అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ చేసిన ట్వీట్ ఇలా ఉంది.
!!జనసేనాని ట్వీట్ !!
తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపధ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తాము..
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్