టీడీపీకి  గుండు  గీసిన ప‌వ‌న్ ?

Pawan Kalyan Sensational comments on TDP government

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫుల్ జోష్ మీద ఉన్నారు, రాజ‌కీయంగా తాను స్పీడును పెంచారు – విశాఖ‌లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న ఉద్య‌మానికి ఆయ‌న త‌న మ‌ద్ద‌తు తెలిపి రాజ‌కీయాల్లో మ‌రింత స్పీడును త‌న పార్టీ త‌ర‌పున పెంచారు… ఇక పోల‌వ‌రం ప్రాజెక్ట్ అంశం పై కూడా ఆయ‌న మాట్లాడారు, పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు వెళ్లారు ప‌వ‌న్… ఇక తాజాగా ఉద్యోగుల స‌మస్య‌ల పై కూడా ఆయ‌న స‌మావేశంలో చర్చించారు… ఇక ఈ స‌మ‌యంలో కాస్త అగ్రెసీవ్ గా స్పీచ్ ఇచ్చారు ప‌వ‌న్.. గ‌తంలో త‌న‌కు ప‌రిటాల ర‌వి గుండు చేయించార‌ని ప్ర‌చారం జ‌రిగిందని దీనిపై ఆయ‌న స్పందించారు.

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.. పరిటాల రవి నాకు గుండు కొట్టించారు అనేది ప్రచారం మాత్రమే. అది పచ్చి అబద్ధం. ఆ ప్రచారం చేయించింది కూడా టీడీపీ వాళ్లే అని ఆయ‌న ఫైర్ అయ్యారు..తెలుగుదేశం నాయ‌కులు అప్పుడు త‌న‌కు ద్రోహం చేశార‌ని ప‌వ‌న్ అన్నారు.. అయినా అవ‌న్ని మ‌న‌సులో పెట్టుకుని తాను కోపం తెచ్చుకోలేదు అని గ‌త ఎన్నిక‌ల్లో బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చాను అని ప‌వ‌న్ అన్నారు.. గ‌తంలో తాను టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి కులాల ఐక్య‌త మాత్ర‌మే అని ప‌వ‌న్ ఉద్వేగ‌భ‌రితంగా అన్నారు.. అయితే తాను సినిమాల్లో చిరాకు వ‌చ్చి గుండు గీయించుకున్నాన‌ని కాని దీనిపై విష ప్ర‌చారం చేశార‌ని ప‌వ‌న్ అన్నారు.. ఇలాంటి ప్ర‌చారం చేసిన స‌మ‌యంలో ప‌రిటాల ఎవ‌రో నాకు తెలియ‌దు అని అన్నారు ప‌వ‌న్.

ఇక జ‌న‌సేనాని ప్ర‌సంగంలో వంగ‌వీటి రంగా హ‌త్య పై కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు..వంగవీటి రంగాను చంపడం తప్పు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ మారలేదు. నగర ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పనిలో పనిగా తెలంగాణలో కులాభిమానం తక్కువ అని ప‌వ‌న్ అన్నారు.. అక్క‌డ తెలంగాణ అభిమానం ఎక్కువ అంటూ పవన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో సినిమాలు కూడా పూర్తిగా వదిలేస్తానని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.. ఇక టీడీపీకి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు కాస్త మంట క‌లిగించాయి, ఇటు ఓ ప‌క్క ప‌వ‌న్ ని పొగుడుతూ మ‌రో ప‌క్క తెలుగుదేశాన్ని నాయ‌కుల‌ను కాస్త ఇబ్బంది పెట్టారు అని నాయ‌కులు అంటున్నారు.. మొత్తానికి ప‌వ‌న్ కు గుండు కొట్టింది అబ‌ద్దం అని అంద‌రికి తెలుసు, అలాగే ఇప్పుడు ప‌వ‌న్ టీడీపీకి గుండు కొట్టారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.