కాపు రిజర్వేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేనాని

Pawan Kalyan Sensational comment on Kapu reservation | cinetollywood.com

కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీలు చేస్తామన్న హామీని పెడుతున్నానని చంద్రబాబు నాతో చెప్పినప్పుడు, సాధ్యమైతేనే చేర్చండి అని అన్నాను ఆయన ఖచ్చితంగా చేస్తాను అని మేనిఫెస్టోలో పెట్టారు – ఆశలు పెట్టి ఇవ్వకపోతేనే తుని లాంటి ఘటనలు జరుగుతాయి – మేనిఫోస్టోలో మాట్లాడే ప్రతి మాట మహావాక్యం దాన్ని మభ్యపెట్టడానికి లేదు – ఓట్లు వేస్తారు కదా అని మీరు ఎలా పెడితే అలా మాట్లాడితే కుదరదు – మీరు మ్యానిఫెస్టోలో 15 శాతం అనుకుని 4,5 శాతం ఇచ్చి ప్రయోజనం ఏంటి? అసలు ఇవ్వకుండా ఉండాల్సింది – విందు భోజనం పెడతానని చెప్పిఆవకాయ బద్ద నాలుక్కి రాస్తే వాళ్లకు తృప్తి ఉండదు – కుల నిర్మూలన జరగాలని కలలు కన్న అంబేద్కర్ కు పాలు పోస్తారు, ఆప్లికేషన్ ఇస్తారు కానీ ఆయన సిద్దాంతాలను ఒక్కరు కూడా పాటించరు – మీరు ఉదాహరించడానికి నాయకులు పనికివస్తారు కానీ ఆయన మాటలు పాటించరు – కులం అనేది ఒక భ్రమ.. లేకపోతే చిరంజీవి పాలకొల్లులో ఓడిపోతాడా? తన ప్రాంతం కానీ తిరుపతిలో గెలుస్తాడా? – యూపీలో ముస్లింలే బీజేపీని గెలిపించారు అక్కడ హిందుత్వం ఎక్కడ ఉంది – అంబేద్కర్ ని నిజంగా గౌరవిస్తే మీ కులాలు అనే ఆలోచనను రాజకీయాల్లోంచి తీసేయాలి – అలా నా వరకు మారతాను, మిమ్మల్ని మారమని చెప్పను ఎందుకంటే మీ సాంఘిక పరిస్ధితులు వేరు – ఏ కులాన్ని నేను తక్కువ చేయను, పదవి కోసం కులాన్ని వాడుకునే స్థాయికి నేను దిగజారను – కులాలను గౌరవిస్తాను కానీ వెనకేసుకుని రాను..

 

ఇదే జనసేన సిద్దాంతం – పార్టీని వెనక్కి లాగిన వ్యక్తుల్లో పరకాల ప్రభాకర్ ఒకరు…ఒకవేళ చిరంజీవి తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి సైలెంట్ గా ఉన్నారు – కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని కలుపుతున్నప్పుడు నేను నిస్సహాయుడ్ని – అల్లు అరంవిద్ నన్ను ఒక నటుడిగా చూసారు – పవన్ కళ్యాణ్ కాపు కాదు ఒక భారతీయుడు – కేవలం నేను పుట్టిన కులమే కాదు అన్ని కులాలు అభివృద్ధి చెందాలి – అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ కావాలంటే ఇప్పుడున్న పార్టీలు అప్పుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చాయో చెక్ చేసుకోండి -ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ నన్ను ఒక కులానికి పరిమితం చేసేలా కథనాలు రాసింది -నేను దేన్ని ఎక్కువగా పట్టించుకోను అందుకే ఆయన ఆఫీస్ తగలబడితే అక్కడికి కూడా వెళ్లాను – టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు నాపై కులం ముద్ర ఎందుకు వేయలేదు – చిరంజీవిపై కథనాలు రాస్తే ఆయన మెతక.. కానీ పవన్ కళ్యాణ్ తిక్క నాకొడుకుని – నన్ను కులానికి అంటగట్టినా, కులనాయకుడిగా చిత్రీకరించినా.. ఏ స్ధాయికైనా ఉపేక్షించను – ఆఫీస్ బాయ్ నుంచి మేనేజర్ స్ధాయి వరకూ కులాలు లెక్కలు తీస్తా – కాపులకు రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అప్పుడు ఆర్ కృష్ణయ్య ఎందుకు ఖండించలేదు, మీ ద్వంద నీతి ఏంటి? – కులాలకు అతీతంగా నేను మురళిమోహన్, గోరంట్ల తరపునా ప్రచారం చేశాను – హామీలను ఇచ్చి నెరవేర్చనప్పుడు ప్రజల తరపున గళం విప్పుతాను – బీసీలకు, కాపులకు మధ్య ఏమీ లేవు.. బీసీలపై ప్రేమ ఉంటే మీరు ఇవ్వండి వంద సీట్లు, మీరు ఇవ్వండి వంద సీట్లు ఇవ్వరు.. ఎందుకంటే గెలిచేవాళ్లకే ఇస్తారు ఆ గెలిచేవాళ్లు మీ కులాల్లోనే ఉంటారు అలా ఏలా? – నేను సత్యమే మాట్లాడతాను.. మీరు మాట్లాడాలనుకుంటే చర్చకు రండీ – ప్రజారాజ్యం పార్టీలా జనసేన పార్టీకి వెన్నుపోటు పొడవాలంటే సాధ్యం కాదు ఎందుకంటే నేను చిరంజీవిలా మంచివాడ్ని కాదు – చిరంజీవికి సహనం ఉంది కానీ నాకు లేదు – నాకు దెబ్బ కొడితే నేను సహిస్తాను.. ప్రజలకోసం వచ్చిన పార్టీపై దెబ్బ కొడితే నేను సహించను, ఎదురుతిరుగుతాను – ఇక్కడికి వచ్చిన వలంటీర్లు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారంటే ఈ క్షణం నుంచి మర్చిపోవచ్చు, మీరు ఎవరూ రావాల్సిన అవసరం లేదు – స్వార్ధం లేకుండా పనిచేస్తామని మీరు నడిస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాను – కార్యకర్తల్లో ఒకరు ఎక్కువ గా ఒకర్ని తక్కువ గా నేను చూడను – జనసేన సేవకుల్ని హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైన కలుస్తాను.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.