టీడీపీ కి అంత సీన్ లేదంటున్న పవన్

Pawan Kalyan said there is no seen to TDP

ఏపీలో ఇప్పుడు ఎక్కడ వినిపిస్తున్నా పవన్ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీచేస్తాయి వీరి మధ్య రహస్య ఒప్పందం జరిగింది అనే వార్త వైరల్ చేస్తున్నారు.. అయితే వాస్తవానికి పవన్ తెలుగుదేశం పార్టీ వైసీపీతో మనకు పొత్తు ఉండదు సింగిల్ గా ఎన్నికల బరిలోకి వెళుతున్నాం అని చెప్పారు అయినా కొన్ని మీడియాలు మాత్రం వక్ర ఆలోచనలతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నాయి. ఇక జగన్ పేపర్ కూడా దీనిపై పవన్ తెలుగుదేశం చెలిమి కుదిరింది సీట్ల పంపకాలు షురూ అని బ్యానర్ వదిలారు… అయితే ఇందులో వాస్తవం లేదు అసలు తెలుగుదేశం పార్టీకి తమకు ఈ ఎన్నికల్లో పొత్తు ఉండదు అని తెలియచేశారు జనసేన నేతలు, ఈ వార్తలను ఖండించారు.

అయితే ఎందుకు ఈ రూమర్ వచ్చింది అంటే ,ఏపీకి చెందిన ఒక బిజినెస్మేన్.. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించారని ఆయనే ఇలా పొత్తు విషయం గురించి చర్చించారు అని అంటున్నారు..పవన్ అమెరికా యాత్ర సందర్భంలోనే ఈ పొత్తు చర్చలకు బీజం పడిందని, అయితే దీనిపై పవన్ ఎటువంటి ముందు అడుగు వేయలేదు అని తెలుస్తోంది.. కావాలి అని ఇలాంటి చర్చలు తెలుగుదేశం నుంచి వస్తున్నాయి అని అసలు జనసేనకు తెలుగుదేశం పార్టీతో కలవాలి అని పొత్తుపెట్టుకోవాలి అని లేదు అంటున్నారు. అయితే ఇద్దరూ కూడా కలిసి మళ్లీ పోటీ చేస్తే ఒకవేళ పవన్ చరిష్మా వాడుకుని మళ్లీ తెలుగుదేశం నేతలు అధికారంలోకి వచ్చి, పవన్ ని ఇప్పటిలా చూడరు అనే గ్యారెంటీ లేదు గత ఎన్నికల్లో చేసిన తప్పుని ఇప్పటికీ పవన్ సరిదిద్దుకోలేకపోతున్నారు.. మరో తప్పు చేయరు అంటున్నారు జనసేన నేతలు, దీనిపై నిశితంగా పవన్ వేసే స్టెప్స్ పరిశీలించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.