ఉభయగోదావరిజిల్లాల్లో పవన్ కొత్త స్ట్రాటజీ

Pawan Kalyan new strategy in East and West Godavari Districts

పవన్ కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల పై ఫోకస్ పెట్టారు ముఖ్యంగా, నియోజకవర్గాల ఇంచార్జుల విషయం పార్లమెంట్ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి అనేది పవన్ వేసిన కమిటీలనుంచి ఇప్పటికే పలు నివేదికలు తెప్పించుకుంటున్నారు.. ముఖ్యంగా అన్ని సమీకరణాలు ఆలోచించి టిక్కెట్లు ఇవ్వాలి అని చూస్తున్నారు పవన్ కల్యాణ్ .. ఇక అన్ని పార్టీల దృష్టి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనపై పడింది. మెజారిటీ స్థానాలు ఇక్కడే గెలుచుకుంటామని ఆ పార్టీ ధీమాతో ఉంది. అందుకే పవన్ ఇక్కడ ఫోకస్ చేశారు అని చెప్పాలి…ఇక ఒంటరిపోరు అని చెప్పడంతో టికెట్ ఆశావాహులు అందరు తమ కేడర్ తో పవన్ ముందుకు వస్తున్నారు.

ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తామేనంటూ ముందుకొచ్చిన జనసేన నియోజకవర్గాల ఇన్చార్జ్ల నియామకానికి అంతర్గత కసరత్తు చేపట్టింది.ఇక మరో వారంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి వీలుగా మరోమారు యాత్రకు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సిద్ధపడుతున్నారు. జిల్లాల వారీగా పార్టీ బలాబలాలు, కలి సొచ్చే వర్గాలు, పోటీ చేసేందుకు అన్ని హంగులు కలిగిన అభ్యర్థులు, అంతకంటేమించి లోక్సభ స్థానాలకు పోటీ చేసే ఆర్థిక స్తోమత ఉన్న వారి అన్వేషణలో పడింది. ఇక ఎంత తొందరగా ఇంచార్జుల పేర్లు చెబితే అంతమంచిది అని చూస్తున్నారు ప్రజలు జనసేన నేతలు కూడా

ఇక ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్గా కలవకొలను తులసీరావు వ్యవహరిస్తున్నారు. ఆయనకు తోడుగా యిర్రింకి సూర్యా రావు, కనకరాజు సూరి, యర్రా నవీన్ ఉన్నారు. పార్టీలో ఏది జరిగినా ఈ నలుగురి నుంచే సమాచారం కేడర్కు అందాలి.. వీరి నుంచి టికెట్ ఎవరు ఆశించినా పవన్ దగ్గరకు సమాచారం వెళుతుంది. అందుకే పవన్ కరుణించాలి అంటే ముందు వీరు మన పేర్లను ప్రకటించాలి అని కూడా నాయకులు చూస్తున్నారు. ఇక టీడీపీ వైసీపీకి గట్టిపోటీ అయ్యే అభ్యర్దుల వేటలో పడింది జనసేన అని చెప్పాలి.. అయితే పవన్ మాత్రం సమాజంపై ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలి అని చూస్తున్నారు.. ఇక రెండు జిల్లాల్లో ఐదు ఎంపీ సెగ్మెంట్లలో బలమైన వారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలి అని, ప్రత్యేక హోదా అంశంలో మనం కూడా ముందు ఉండిపోరాటం చేయడానికి ఎంపీలు అవసరం అని జనసేనాని ఆలోచనగా తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.