
పవన్ న్యూ పొలిటికల్ ప్లాన్ !! విశ్లేషణాత్మక కథనం !!
!! విశ్లేషణాత్మక కథనం !!
పవన్ కల్యాణ్ పొలిటికల్ స్టార్ గా ఎదుగుతున్న వ్యక్తి… ఇటు సినిమాలలో ఆయన స్టార్ హీరో అనేది తెలిసిందే.. అలాగే రాజకీయాల్లో కూడా ఇప్పటి రాజకీయాలకు భిన్నంగా రాజకీయాలు చేస్తూ అభిమానులను మిక్కిలి సంపాదించుకుంటున్న పొలిటికల్ స్టార్… తెలంగాణలో రాజకీయ యాత్ర – ఏపీలో కరవు యాత్ర చేసి మరో సంచలనం సృష్టించారు.. అయితే ఇటు తెలంగాణలో 2014 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయని పవన్ కల్యాణ్, గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశానికి బీజేపీకి సపోర్ట్ చేశారు.. అయితే ఈ వారం జరిపిన మీడియా సమావేశంలో కూడా, తనని గత ఎన్నికల్లో వాడుకుని వదులుకున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు…. గత ఎన్నికల్లో తాను అనవసరంగా తెలుగుదేశం- బీజేపీకి సపోర్ట్ చేశాను అనే డైలమా మేల్కొలుపు వచ్చింది పవన్ కు .
ఇక పవన్ ఏపీలో ప్రత్యేక హూదా ఉద్యమంలో ముందుకు వెళుతున్నారు… ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఎటువంటి రూటుకు వెళుతుందో తెలియదు…. కాని పవన్ మాత్రం కేంద్రం పై దూకుడు పెంచాలి అని పిలుపునిస్తున్నారు.. ఇటు తెలుగుదేశాన్ని పొగుడూతూ ఎందుకు చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు రావడం లేదు అనేలా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు… అయితే మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రాలేదనే విషయం తెలిసిందే…అలాగే వైసీపీ కూడా చంద్రబాబు పార్టనర్ అని పవన్ ని ఫిక్స్ చేసింది.. ఈ సమయంలో పవన్ తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లో కాస్త పొలిటికల్ తెరపై సరికొత్త ఆవిష్కరణలుగా కనిపించనున్నాయి.
పవన్ రాజకీయంగా ఏమీ తెలియని వ్యక్తి… కాని తనకు ఏం చేయాలో తెలుసు అని అంటారు ఇది ఆయన సత్తా అనుకోవచ్చు.. అయితే ఇప్పుడు ఏపికి ప్రత్యేక హూదా ఇచ్చే పార్టీతో కలిసి మద్దతు ఇస్తాం అని నేషనల్ పార్టీలకు జగన్ ఆఫర్ ఇచ్చారు… మరి పవన్ కేంద్రం పై పోరాటం చేయాలి అని అంటున్నారు.. అయితే బీజేపీ పై ఆయనకు నమ్మకం లేదు.. ఇటు కాంగ్రెస్ తో కలిసే ఆలోచన లేదు.. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో ఆయన కలిసే అవకాశం ఉంది అంటున్నారు.. పైగా తనకు అధికార కాంక్ష లేదు సీఎం అవ్వాలి అనిలేదు… నాకు బలం ఉన్న చోట పోటి చేస్తా అని అంటున్నారు.. అంటే ఇప్పుడు సీఎం కాంక్ష పవన్ కు లేదు, అందుకే తనకు బలంగా ఉన్న సీట్లు తెలుగుదేశంతో చర్చించి తీసుకునే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో..ఈ పొత్తు కుదరకపోతే తనకు తానుగా స్వతంత్రంగా నిలబడవచ్చు, తన అభ్యర్దులతో ఎన్నికల్లో ముందుకు వెళ్లవచ్చు.
ఇటు తెలంగాణలో థర్డ్ ఫ్రంట్ అంటూ చెబుతున్న కేసీఆర్ కు మద్దతు ఇవ్వచ్చు… గెలిచిన వారితో కేసీఆర్ వెనుక ఉండవచ్చు. అలాగే కేసీఆర్ కూడా పవన్ చెలిమి కోరుకుంటున్నారు… దానికి కారణం కోదండరాం లాంటి నాయకుడిని ఎదుర్కోవాలి, నిరుద్యోగులతో కలిసి ముందుకు వెళ్లాలి అని కోదండరాం పార్టీ అంటున్నారు… అంటే ఆయన రాజకీయ పార్టీని ఎదిరించాలి అంటే? పవన్ లాంటి స్టామినా కలిగిన నాయకుడ్ని తెలంగాణలో దించాలి అని భావిస్త్తున్నారు. ఇటు పవన్ ఎలాగో కాంగ్రెస్ కు తెలంగాణలో మద్దతు ఇవ్వరు, అలాగే తెలుగుదేశం కూడా టీఆర్ ఎస్ తో కలిసి ముందుకు నడిచేలా ఉంది… ఇప్పుడు ఏపీలో జరిగిన 2014 సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుంది అనేది తెలుస్తోంది. తెలుగుదేశం టీఆర్ఎస్ జనసేన కలిసి త్రయంగా తెలంగాణలో ముందుకు వెళడం అనేది తథ్యం వచ్చే ఎన్నికల్లో.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు