విశాఖ నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ సెగ్మెంట్ ఫైనల్

Pawan Kalyan is contesting from Visakhapatnam final

తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఇప్పుడు అభ్యర్దులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి ..ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ నుంచి ఈరోజు రేపు తుదిజాబితా మొత్తం బయటకు రానుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులను ఫైనల్ చేశాము అని, ఆ నెంబర్ ను కూడా ట్విట్టర్లో తెలియచేశారు.. ఇక పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతూ ఆయన ముందుకు వెళుతున్నారు.. అయితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే అంశం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసే స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది.. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీచేసే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది… ఇక అనంతపురం శ్రీకాకుళం, పాలకొల్లు, కాకినాడ, నరసాపురం, ఏలూరు ఇలా అనేక సెగ్మెంట్ల పేర్లు పవన్ పోటీ చేస్తారు అని వినిపించాయి. కాని చివరకు ఆయన విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తోంది, ఇప్పుడు జనసేన వర్గాల్లో ఈ విషయం పై చర్చ కూడా జరుగుతోంది.

ఇప్పటికే విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా, ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. అలాగే జేడి లక్ష్మీనారాయణ కూడా భీమిలి నుంచి పోటీ చేయనున్నారు.. సో మొత్తానికి ఈసారి విశాఖ జిల్లాలో సరికొత్త పొలిటికల్ వేవ్స్ కనిపించనున్నాయి అనే చెప్పాలి.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.