పవన్ కల్యాణ్ చెప్పిందే బాబు కాపీ

Pawan Kalyan has said that Babu is copying

పవన్ కల్యాణ్ ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు వైసీపీ టీడీపీ ముందు ఉన్న ఆలోచనలు.. అందుకే ఇలాంటి ఆలోచనలకు తగ్గట్లుగా వారి ప్లాన్ కనిపిస్తోంది…వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక దేశంలో ఎక్కడా లేని పథకాలు ఏపీలో అమలు చేశామని చెప్పిన బాబు మళ్లీ తెలంగాణ పథకాలతో పోల్చి వారికంటే మనవే బెటర్ అని అన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది మధ్యలో పవన్ కల్యాణ్ ని రాజకీయంగా తీసుకువస్తున్నారు చంద్రబాబు.

తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఏకమైనా జనం అభిప్రాయాన్ని మార్చలేరని చెప్పారు. చివరకు తాము చెప్పింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారని చెప్పారు. కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని పవన్ కూడా చెప్పారన్నారు.

మొత్తానికి పవన్ కల్యాణ్ జపం చేయనిదే జగన్ కు బాబు కు రాజకీయంగా పబ్బం గడవదు అనేది తేలిపోయింది.. ముఖ్యంగా రాజకీయాలు చర్చించుకుంటే పర్వాలేదు. ఇక్కడ బాబు కాపీపేస్టు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు.. అందుకే ఇక్కడ జనం కూడాబాబు మాటలను విశ్వసించడం లేదు.. ఇక పథకాలే కాదు ఏకంగా ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు కూడా కాపీ పేస్ట్ చేస్తున్నారు బాబు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.