ఆకుల సత్యనారాయణ కు పవన్ బంపర్ ఆఫర్

Pawan Kalyan gave bumper offer to Akula Satyanarayana

టైమ్ బాగుంటే రాజకీయంగా ఫేట్ బాగుంటి.. ఏదీ బాగోపోతే వార్డ్ మెంబర్ కూడా మంత్రి స్దాయి నాయకుడికి రెస్పెక్ట్ ఇవ్వడు.. కొన్ని సార్లు ఇం త స్టేచర్ ఉన్నా అలాంటి పరిస్దితి కలుగుతుంది..రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.. ఇక ఎంపీగా ఆయన పోటీకి కూడా రెడీ అవుతున్నారు.. గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ తరపున టికెట్ సాధించి ఆయన తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక బీజేపీలో ఆయన ఉన్నంత కాలం ఎమ్మెల్సీ సోమువీర్రాజుకి ,ఆయనకు రాజకీయంగా పడేది కాదు..వారిద్దరికి రాజకీయ వైరం ఉంది..అలాగే ఏపీలో బీజేపీ కూడా పుట్టిముగినే పరిస్దితిలో ఉంది అని ముందుగానే గమనించారు.

ప్రముఖ వైద్యునిగా రాజమండ్రిలో పేరు సంపాదించుకున్న ఆకుల సత్యనారాయణ రాజకీయలపై ఆసక్తితో కాంగ్రెస్లో చేరారు, ఇక అక్కడ ఫేట్ ఏమీ మారలేదు ఎదుగుదల లేదు, ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకు ఉన్నఆర్థిక బలాల నేపథ్యంలో అప్పట్లో టిక్కెట్ వస్తుందని అందరూ అనుకున్నా, కొన్ని సమీకరణల వల్ల కుదరలేదు.2014 ఎన్నికల్లో బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చింది…దీంతో ఎమ్మెల్యేగా గెలిచారు.. గెలిచినా టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పదే పదే సిటీ రాజకీయాల్లో వేలు పెడుతుండడం, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పార్టీ తరపున ఆయన పై విమర్శలు చేయడంతో, ఇక చేసేది లేక ఆయన పార్టీ కూడా మారారు

ఉప రాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆకుల తన రాజకీయ గురువుగా భావించేవారు.ముందు వైసీపీలోకి వెళ్లాలి అని భావించినా వైసీపీ అధినేత జగన్ సీటు ఇవ్వను అని తెలియచేశారు, అంతేకాదు సిటీ సీటును మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుకు ఇచ్చేశారు. అలాగే ఎంపీ సీటును బీసీ వర్గానికి చెందిన మార్గాని భరత్కు ఇవ్వడంతో ఆయనకు అక్కడ పోటీ చేసే ఛాన్సులు మూసుకుపోయాయి. దీంతో జనసేనలో చేరాలి అని భావించారు ఆయన….ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనభార్య ఎమ్మెల్యేగా రాజమండ్రి నుంచి రెండు స్ధానాలలో ఒక చోట పోటీ చేయనున్నారు.. ఇక ఆయన ఎంపీగా రాజమండ్రి నుంచి జనసేన తరపున పోటి చేయనునారు అని తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.