పవన్ చంద్రబాబుకి సూటి ప్రశ్న

Pawan Kalyan Chandrababu is a direct question

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన వెంటనే ఇది కావాలనే వైసీపీ సానుభూతి కోసం చేయించుకున్న పని అని అనడం, చూస్తుంటే తెలుగుదేశం ఆలోచన ఎలా ఉందో ఇట్టే అర్ధం అయిపోతోంది. ఆ వ్యక్తి ఇంకా కోలుకోకుండానే జగన్ వి నాటకాలు అని అనడం, చాలా హేయమైన మాటలు అని అన్నీ పార్టీలు ముక్తకంఠంతో అంటున్నాయి. అయితే జగన్ చేసిందితప్పు అని, ముందు విశాఖలోనే చికిత్స తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పారు. ఇక పవన్ మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు ఇంత ప్రేమ, సానుభూతి జగన్ పై చూపించడం ఏమిటి అని విమర్శించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, పవన్, బీజేపీ ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ఈ దాడిని ఖండించారు. అయితే దీనిపై పవన్ కూడా తన రీతిన స్పందించారు. సీఎం చంద్రబాబు కామెంట్ల పై ఆయన సీరియస్ అయ్యారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకని మండిపడ్డారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఈ సంఘటన జరిగిన పరిణామం తెలుగుదేశం తెలుసుకోవాలి.. అక్కడ భద్రతా లోపం ఎవరిది అనేది ముందు తెలుసుకోని, ఆలోచిస్తే తప్పు ఎవరిది అనేది తెలుస్తుంది.. ఓపక్క కేంద్రానికి ఇక్కడ భద్రత అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే ,మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానిది భద్రత అని కేంద్రం అంటోంది. మొత్తానికి ఎక్కడ ఏం జరిగినా పవన్ పై ఈ తెలుగుదేశం కామెంట్లు చేయడం మాత్రం మానడం లేదు అనేది పవన్ ఆలోచన. నిజమే మరి తప్పు వారిలో ఉన్నా పవన్ ని విమర్శించడం ఏమిటి అనేది పెద్ద ఆలోచన.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.