జనవరిలో అభిమానులకు పవన్ మరో అవకాశం

Pawan has another chance for fans in January

రాజకీయాలు అంటేనే విమర్శలు డబ్బు కుట్రలు కుతంత్రాలు రాజకీయ ఎత్తుగడలు, ఇలాంటివి అన్నిచేస్తేనే రాజకీయాల్లో పార్టీలు నాయకులు సర్వైవ్ అవ్వగలరు, మరి సినిమాల నుంచి వచ్చిన వారికి రాజకీయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి సమయం పడుతుంది.. అవతల వాడు ప్రత్యర్ది అయితే ఇక మనపై ఎలాంటి కుట్రలు పన్నుతారు అనేది తెలుసుకుంటారు.. తాజాగా ఇప్పుడు పరిస్దితి అలాగే ఉంది. ఏపీలో రాజకీయ పార్టీల్లో జనసేన కీరోల్ పోషిస్తోంది అనే చెప్పాలి. పవన్ పై నమ్మకంతో నాయకులు ఇటీవల పార్టీలో చేరుతున్నారు.

జనసేన ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజా అభిమానం సంపాదించుకుంది .ఇక గుర్తు కూడా పార్టీకి రావడంతో పోటికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆర్ధికంగా అంత అండదండలు పవన్ కు లేవు అనే చెప్పాలి.సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు పవన్.. అయితే ఆయనకు ఉన్న ఆస్తి కేవలం ఆయన అభిమానులు జనసేన పార్టీ నాయకులు పార్టీ అభిమానులు అనే చెప్పాలి ..ఇక పార్టీ భవిష్యత్తులో ఎలాంటి రూట్ లోకి వెళుతుంది అంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు కాబట్టి నేతలు అభిమానులు కూడా దైర్యంగా ఉన్నారు.. జనవరి నుంచి పార్టీ ఫుల్ జోష్ తో ప్రజల్లో ఉంటుంది అని తెలుస్తోంది.

ఇక తాజాగా ఆయన ఏమైనా పిలుపు ఇస్తే లక్షలాదిగా తరలి వస్తున్న పవన్ ఫ్యాన్స్ ని చూస్తే అవతల పార్టీలు కాస్త టెన్షన్ పడుతున్నాయి అనే చెప్పాలి. పవన్ కు అభిమానులు ఓ స్ట్రేచర్ కి తీసుకువెళ్లారు అనే చెప్పాలి.. పవన్ పిలుపుకి లక్షలాది మంది వస్తున్నారు, కాని మిగిలిన పార్టీలకు మాత్రం ఇలా కాదు, డబ్బులు ఖర్చు చేస్తేనే జనం వస్తారు అనేది తెలిసిందే. ఇక ఇలాంటి పార్టీ అభిమానులకు తన ఫ్యాన్స్ కు ఏమైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు పవన్ కల్యాణ్ అని తెలుస్తోంది..

సోషల్ మీడియాలో కూడా పవన్ కు ఎంతో ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈజీగా ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లారు.. అందుకే జిల్లాల వారిగా ఆయన అభిమానుల కోసం ఓ కార్యక్రమం చేసే ఉద్దేశంలో ఉన్నారు అని తెలుస్తోంది… జిల్లాలో సమావేశాలు పెట్టి వారితో ఏమి చెయ్యాలి, పార్టీకి వారు ఏమి సలహాలు ఇస్తారు అనేది రోజుకో జిల్లాలో ఓ సభ ద్వారా వారితో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పవన్.. 13 జిల్లాల్లో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఏర్పాటు చేసే ఆలోచనలో పవన్ ఉన్నారు అని తెలుస్తోంది.. దీంతో పవన్ అభిమానులు జోష్ లో ఉన్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.