జనసేనలోకి ప్రముఖ వ్యాపారవేత్త పవన్ గ్రీన్ సిగ్నల్

వైసీపీ టీడీపీలకు పోటీగా జనసేన తన దూకుడు చూపిస్తోంది..ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఫోకస్ పెట్టిన పవన్, రాజకీయంగా పార్టీలో చేరాలి అని అనుకునే వారికి వెల్కమ్ చెబుతున్నారు. ఇక్కడ ఆర్దికంగా బలమైన వారిని ఏమీ ఆయన చూడటం లేదు, కాస్త కేడర్ ప్రజలకు తెలిసిన వ్యక్తి
అయితే బెటర్ అని చూస్తున్నారు.. తాజాగా ప్రకాశంలో జనసేన తన స్పీడు పెంచింది.. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ యాదవ్ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇదే విషయం పై ఇప్పుడు గిద్దలూరులో చర్చలు జరుగుతున్నాయి. ఆయన తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఒంగోలు నగరం త్రోవగుంట ప్రాంతంలో ఉన్న తన కార్యాలయాన్ని కూడా జనసేన జిల్లా ఆఫీసు నిర్వహణకు ఆయన సిద్ధం చేస్తున్నారట. ఒంగోలులో వ్యాపారవేత్తగా ఉన్న చంద్రశేఖర్యాదవ్ రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నారు. కొంత కాలంగా యాక్టీవ్ రాజకీయాల్లో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక ఆయన వైసీపీ టీడీపీలో చేరకుండా స్దబ్దుగా, వ్యాపారాల్లోనే కొనసాగుతున్నారు. ఇక్కడ గిద్దలూరులో స్వంత గృహం కూడా ఏర్పాటు చేసుకున్నారు.. ఇక పీసీసీ చీఫ్ రఘువీరాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన ,మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అవ్వాలి అని భావించారు, అందుకే జనసేనలో చేరాలి అని నిర్ణయించుకున్నారట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఈయన పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

గిద్దలూరులో అటు కాపు సామాజికవర్గంతో పాటు ఇటు యాదవ సామాజికవర్గం ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నాయి. దీంతో యాదవ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్తో మూడు నాలుగు నెలలుగా టచ్లో ఉన్నారు.
ఇక రాజకీయంగా యాక్టీవ్ అవ్వాలి అని అనుకుంటున్న ఆయన వెంటనే ఒకే చేశారు అని తెలుస్తోంది. రెండు రోజుల్లో ఆయన పార్టీలో చేరిక ఉంటుంది అని తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.