Cinetollywood

పందెంకోడి 2 రివ్యూ

Pandem kodi 2 movie review

న‌టీనటులు విశాల్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాజ్‌కిర‌ణ్, హ‌రీష్ పేర‌డే, గంజా క‌రుప్పు త‌దిత‌రులు
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
కెమెరా: కె.ఎ.శ‌క్తివేల్‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్స్‌: లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌
దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి

!!ఇంట్రో!!

త‌మిళ స్టార్ హీరోలు, సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. ఇక్క‌డ అక్క‌డ హీరోలు ఇద్ద‌రూ ఒక‌టే అనేలా ఉంటారు. ఇక యువ హీరోల సినిమాలు రెండు రాష్ట్రాల్లో స‌క్సెస్ అయిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఇక కోలీవుడ్ లో ఇప్పుడు ఉన్న హీరోల్లో విశాల్ కు ఎంతో స్టార్ డ‌మ్ ఉంది. హీరోగా న‌డిగ‌ర్ సంఘం ప్ర‌తినిధిగా అలాగే ప్ర‌జాసేవ‌కు ముందు ఉండే వ్య‌క్తిగా పేరు ఉంది.

ఇక త‌న సినిమా కెరియ‌ర్ లో ఎన్నో స‌క్సెస్ లు చూశాడు విశాల్…ప్రేమ చద‌రంగం`తో కెరీర్‌ను స్టార్ చేసిన విశాల్‌కు రెండో సినిమా సండైకోళి అనేది తెలిసిందే.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విశాల్‌కు యాక్ష‌న్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.. ఈ సినిమా విశాల్ కు మ‌రింత క్రేజ్ తెచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా తెలుగులో పందెంకోడి అనే పేరుతో విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించింది. విశాల్‌కు భ‌ర‌ణి, పొగ‌రు చిత్రాలు కూడా తెలుగులో మంచి విజ‌యాన్ని అందించి మాస్ హీరోగా నిల‌బెట్టాయి. ఇలా తెలుగు, తమిళంలో ఆద‌ర‌ణ ఉన్న అతి త‌క్కువ మంది హీరోల్లో విశాల్ ఒక‌రయ్యారు..విశాల్ త‌న 25వ సినిమాగా త‌న‌కు బ్రేక్ ఇచ్చిన పందెంకోడి సీక్వెల్‌గా `పందెంకోడి 2`ని నిర్మించారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి స‌క్సెస్ అందుకుందో చూద్దాం.

!!క‌థ‌!!

కడ‌ప ప్రాంతం రాజారెడ్డి !!రాజ్‌కిర‌ణ్‌!! స‌హా కుల‌దైవం వీర‌భ‌ద్రుడుని కొలిచే ఏడు గ్రామాల ప్ర‌జ‌లు అన‌వాయితీగా జాత‌ర‌ను జ‌రుపుకుంటుంటారు. ఓసారి జాత‌ర‌లో ముద్ద‌నూరుకి చెందిన ఇద్ద‌రి మ‌ధ్య తిండి వ‌డ్డించే విష‌యంలో మాటా మాట పెరుగుతుంది. ముద్దనూరుకి చెందిన వ్య‌క్తి మ‌రో గ్రామానికి చెందిన వ్య‌క్తిని న‌రికేస్తాడు. ఎదుటి గ్రామానికి చెందిన వ్య‌క్తులు ముద్ద‌నూరుకి చెందిన వ్య‌క్తిని న‌రికేస్తారు. దాంతో అత‌ని భార్య భ‌వాని !! వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ !!త‌న భర్త‌ను చంపిన వ్య‌క్తి కుటుంబంపై క‌క్ష పెంచుకుంటుంది.

వారి కుంటుంలో అంద‌రిని చంపేస్తుంది. ఓ కుర్రాడిని మాత్రం చంప‌కుండా వ‌దిలేస్తారు. ఈ గొడ‌వ‌ల కార‌ణంగా ఏడు గ్రామాల జాత‌ర ఏడేళ్లు ఆగిపోతుంది. చివ‌ర‌కు రాజా రెడ్డి ఏడు గ్రామాల పెద్ద‌ల‌తో క‌లిసి మ‌ళ్లీ జాత‌ర‌ను ఘ‌నంగా చేయాల‌నుకుంటారు. అదే జాత‌రలో భ‌వాని త‌న భ‌ర్త‌ను చంపిన కుటుంబంలో మిగిలిపోయిన కుర్రాడిని చంపాల‌నుకుంటుంది. కానీ రాజా రెడ్డి ఆ కుర్రాడి కాపాడుతాన‌ని మాట ఇస్తాడు. అదే స‌మ‌యంలో ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న బాలు!! విశాల్!! జాత‌ర‌ను చూడ‌టానికి ఊరొస్తాడు.

ఈ ఊర్లోనే చారుల‌త !! కీర్తిసురేశ్‌!! ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. అదే స‌మ‌యంలో ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో భ‌వాని, ఆమె మ‌నుషులు ఆ కుర్రాడిని చంపాల‌నుకుంటారు. కానీ రాజారెడ్డి, బాలు ఆ కుర్రాడిని వివిధ సంద‌ర్భాల్లో కాపాడుకుంటూ ఉంటారు. చివ‌ర‌కు ఓ గొడ‌వ‌లో రాజారెడ్డికి అనుకోని ప్ర‌మాదం జ‌రుగుతుంది. అప్పుడు బాలు ఏం చేస్తాడు? త‌ండ్రికిచ్చిన మాట‌ల‌ను నిల‌బెట్టి జాత‌ర‌ను జ‌రింపించడ‌మే కాకుండా.. కుర్రాడిని కూడా కాపాడుకుంటాడా? అనేది తెలియాలంటే వెండితెర‌పై ఈ సినిమా చూడాల్సిందే.

!!విశ్లేష‌ణ‌!!

రాయ‌ల‌సీమ పై సినిమాలు ఫ్యాక్ష‌న్ వివాదాల‌పై సినిమాలు వ‌స్తూనే ఉంటాయి.. ఇది అలాంటి కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇక్క‌డ పందెం కోడి వ‌న్ నుంచి 2 సీక్వెల్ గా వ‌చ్చింది అనే స‌రికి, ఎక్స్ పెక్టేష‌న్స్ చాలా ఉంటాయి. అయితే ఆ అంచ‌నాలు ఈ సినిమా అందుకుంది అనే చెప్పాలి.. ఇక సినిమాలో మెయిన్ పాత్ర కీర్తిసురేశ్.. ఈ సినిమాలో కామెడీ పార్ట్ అనేదేదైనా ఉందంటే అది కీర్తిసురేశ్ వ‌ల్ల‌నే క్రియేట్ అయ్యింది. ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఈ సినిమాలో ఆమె క‌నిపించింది.

ఇక వ‌ర‌ల‌క్ష్మి విల‌నిజం బావుంది. రివేంజ్ డ్రామాలో వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌న త‌నలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రింప‌చేస్తుంది.
ఆమె న‌ట‌న అంద‌రికి న‌చ్చుతుంది.రాజారెడ్డి పాత్ర‌లో రాజ్‌కిర‌ణ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించారు.ఇక లింగుస్వామి సినిమాను షార్ప్‌గా తెర‌కెక్కించాడు. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లా కాకుండా కొత్తద‌నం చూపించారు. ఏడు రోజుల జాత‌ర అనే కాన్సెప్ట్ చాలా కొత్త‌గా అనిపిస్తుంది. విశాల్ త‌న తండ్రికి ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమాలో తీసుకున్న నిర్ణ‌యాలు బాగుంటాయి. వ‌న్ కి క‌నెక్ట్ అయ్యే సీన్లు ఇక్క‌డ మాత్రం చూపించ‌లేక‌పోయారు.కొన్ని లాజిక్స్ చాలా సింపుల్ గా మిస్ అయ్యాయి. ఇక నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మొత్తానికి లింగుస్వామి మ‌రో స‌క్సెస్ ని విశాల్ కు అందించారు అనే చెప్పాలి.

!!ప్ల‌స్ పాయింట్స్‌!!
విశాల్ న‌ట‌న‌
లింగుస్వామి టేకింగ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్
కెమెరా వ‌ర్క్‌
కీర్తిసురేశ్ న‌ట‌న‌
చిలిపిప‌నులు

!!మైన‌స్ పాయింట్స్‌!!
ఓ చోట మాత్ర‌మే తిరిగే క‌థ‌
కాస్త లాజిక్ మిస్ అయిన అంశాలు.

!!బాట‌మ్ లైన్ !! తండ్రి మాటకై కొడుకు సాహ‌సం పందెం కోడి-2

!!రేటింగ్!! 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.