వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముహూర్తం ఫిక్స్

Panchakarla Ramesh babu joing to YSRCP

తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది.. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేశ్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో టీడీపీ శ్రేణులు అందరూ ఇదే విషయం చర్చించుకుంటున్నారు, ఆయన వచ్చే నెల అంటే అక్టోబర్ 8న విజయదశమి రోజున వైసీపీలో చేరాలని భావిస్తున్నారట.

ఇక ఆయన వైసీపీలోకి జంప్ అవుతారు అని వార్తలు రావడంతో టీడీపీ శ్రేణులు అక్కడ కేడర్ షాక్ అయ్యారు చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నట్టు ఆయన ముఖ్య అనుచరులు పేర్కొంటున్నారు.

ఇటీవల ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల…వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకాలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా ఆయన వైసీపీలో చేరాలని చూస్తున్నారట. ఇక వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీలోకి వెళ్లనున్నారు అని తెలుస్తోంది. విశాఖలో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తన సత్తాచాటాలని చూస్తోంది. అందుకే పలువురు నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు జగన్.

పంచకర్ల ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు ..ఆయన 2009లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు . తర్వాత కాంగ్రెస్ లో కొనసాగారు.2014 ఎన్నికల సమయంలో చంద్రబాబుతో భేటీ అయి ఆయన టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి పంచకర్ల రమేశ్బాబు ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ రూరల్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో రూరల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఆయన వెంటనే క్విక్ డెసిషన్ తీసుకుని వైసీపీలో చేరుతున్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.