Cinetollywood

“పైసా వసూల్” రివ్యూ & రేటింగ్

‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో 100 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య. తన 101 సినిమా ‘పైసా వసూల్’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాద్ డైరెక్షన్ లో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమాలో శ్రియసరన్, ముస్కన్ సేథి, కైరా దత్ బాలయ్యకు జోడిగా నటించారు.మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఏ చిత్తానికి స్వరాలు సమకూర్చారు. సినిమా విశేషాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

స్టోరీ :

సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ డేరింగ్ యాటిట్యూడ్ తో.. ఎంతటివారినైనా ఎదుర్కునే మనస్తత్వం కలిగినవాడు తేడా సింగ్(బాలకృష్ణ). అయితే తేడా సింగ్ చేసే కొన్ని డేరింగ్ పనుల వల్ల చాలా విషయాల్లో తనకు తెలియకుండా కొందరికి హెల్ప్ అవుతుంటాడు.ఇక అదే టైంలో బాబ్ మార్లో అనే ఇంటర్నేషనల్ డాన్ కు చెక్ పెట్టెందుకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం తేడా సింగ్ కరెక్ట్ అని అతని వాడుకోవాలనుకుంటారు. అయితే మరి తేడా సింగ్ ఆ డాన్ ను పట్టుకునే డీల్ ఒప్పుకున్నాడా..? ఇంతకీ ఈ తేడా సింగ్ కథ ఏంటి..? ఇందులో శ్రియకి-తేడా సింగ్ కి సంబంధం ఏంటి? తేడా సింగ్ ఎందుకలా రెక్లెస్ గా తయారయ్యాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల ఫెర్ఫార్మెన్స్:

‘పైసా వసూల్’కు అతి పెద్ద ఆకర్షణ బాలయ్యే. సినిమాలో బాలయ్యది వన్ మ్యాన్ షో.. ఆయన తేడా సింగ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు బాలయ్య చేసిన పాత్రల్లో ఇది చాలా డిఫరెంట్ పాత్ర అని చెప్పాలి. బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు పూరీ డైలాగ్స్, యాక్షన్ తోడవ్వడంతో బాలకృష్ణ కొత్తగా కనిపించారు. బాలయ్య డైలాగ్స్ కి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలయ్య పాడిన ‘మావ ఎక్ పెగ్ లా..’ అనే పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక శ్రియ సరన్ తన పాత్రకు పూర్తిన్యాయం చేసింది. ముస్కన్ సేథి, కైరా దత్‌లు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు. ఇక నెగెటివ్ పాత్రలో నటించిన విక్రమ్ జిత్ బాగా చేసారు. అలీ, పృద్వీ పర్వాలేదనిపించారు. ఇక మిగితా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమా సంగతికి వెళ్తే.. ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదా సరదా గా, యాక్షన్ ఎపిసోడ్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో వేళ్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కాస్త ఎమోషన్ కూడా బాగుంది. బాలయ్య అభిమానులకు ‘పైసా వసూల్’ బానే ఎంజాయ్ చేస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతలను విషయంలో పూరీ జగన్నాధ్ మెచ్చుకోవాలి. ముఖేష్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు.

మైన‌స్ పాయిట్స్ :

ఇలాంటి కథతో పూరి జగన్నాథ్ అల్రెడి మూవీ చేసేశాడు. కాబట్టి కథలో పెద్దగా దమ్ములేదని చెప్పాలి. కథనం కొత్తగా కూడా ఏం లేదు. సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు.లాగే డైలాగుల్లోనూ తన మార్కు చూపించాడు పూరి. కానీ కథాకథనాల విషయంలో మాత్రం పూరి మరోసారి నిరాశ పరిచాడు. మాఫియా కథల మోజులోంచి బయటికి రాకపోవడంతో ‘పైసా వసూల్’ ఓవరాల్ గా సాదాసీదా సినిమాలా కనిపిస్తుంది. ఈ విషయంలో పూరి అసలు కసరత్తే చేయకపోవడం.. కొత్తగా ఆలోచించకపోవడం నిరాశ పరుస్తుంది.కమర్షియల్ సినిమాలకు ముఖ్యమైన ప్రతినాయకుడి పాత్ర ఈ సినిమాలో అంత బలంగా లేకపోవటంతో, బాలయ్యలోని పవర్, ఊపు స్క్రీన్ మీద పెద్దగా కనబడలేదు. ఈ అంశం సాధారణ ప్రేక్షకులకు ఎలా ఉన్నా బాలకృష్ణ వీరాభిమానులకు కాస్త ఎక్కువ నిరుత్సాహాన్నే కలిగిస్తుంది.

cinetollywood.com రేటింగ్ – 2.5/5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.